ఏపీ ఎమ్మెల్యేలపై తీవ్ర క్రిమినల్ కేసులు.. టాప్‌లో వైఎస్సార్సీపీ.. అందులో జగన్! | jathara.com

ఏపీ ఎమ్మెల్యేలపై తీవ్ర క్రిమినల్ కేసులు.. టాప్‌లో వైఎస్సార్సీపీ.. అందులో జగన్!

ఎమ్మెల్యే , ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్న జాబితాను తమ అధికార పార్టీ వెబ్సైట్ లో ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.. ఇందుకోసం పార్టీలకు 48 గంటల సమయం ఇచ్చింది. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ధర్మాసనం 72 గంటలు గడువు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి ఎంత మంది నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఏ ఏ పార్టీల తరఫున పోటీ చేశారనే విషయాన్ని ఏపీ ఎలక్షన్ వాచ్ (ఏపీఈడబ్ల్యూ), అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అఫిడవిట్ల ఆధారంగా విశ్లేషించారు. అయితే ఇందులో యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక్క జనసేన ఎమ్మెల్యే ఉన్నారు..

ఇక ఏపీ ఎమ్మెల్యేల్లో 163 మంది కోటీశ్వరులు ఉండగా,అందులో 92 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడీఆర్ అనాలిసిస్ ప్రకారం సీఎం జగన్‌‌పై ఎక్కువ సంఖ్యలో సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయనపై మొత్తం 38 కేసులు ఉండడం గమనార్హం…

Read also :  అప్పుడు తప్పక లేచిపోయారు.. ఇప్పుడు తప్పు తెలిసి వచ్చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే!

అయితే దీనిపైన వైసీపీ నేతలు మాట్లాడుతూ… ఆరోపణలు ఇంకా నిరూపితం కాకుండా, విచారణ ఎదుర్కొంటున్నవారిని క్రిమిన్సల్‌గా భావించలేమని వాదిస్తున్నారు..