గుడి ముందు భిక్షాటన.. తిరిగి అదే గుడికి విరాళం! | jathara.com

 గుడి ముందు భిక్షాటన.. తిరిగి అదే గుడికి విరాళం!

దేవాలయాల ముందు భిక్షాటన చేసే వాళ్లను చూసి మనకి తోచినంత చిల్లరను భిక్షంగా వేస్తాం… అలా భిక్షాటన చేసిన డబ్బుతో తమ పోషణతో పాటు తమని నమ్ముకున్న వారిని కూడా పోషిస్తుంటారు.. కానీ ఓ భిక్షగాడు మాత్రం ఏ దేవాలయం ముందు అయితే భిక్షాటన చేసాడో తిరిగి అదే దేవాలయానికి విరాళం ఇచ్చేసాడు. విరాళం అంటే వందలో వెయిలో కాదు లక్షల్లో..

Read also :  మోడీ పెట్టుకున్న ఈ కళ్ళజోడు ధర ఎంతో తెలుసా?

వినడానికి కొంచం షాకింగ్ గానే ఉన్నప్పటికీ వాస్తవమే..విజయవాడకు చెందిన యాదిరెడ్డి సాయిబాబా ఆలయ నిర్మాణం కోసం గత ఏడేళ్లలో రూ.8 లక్షలు విరాళంగా ఇచ్చాడు.. ముందుగా అతను భిక్షగాడు కాదు. రిక్షా తొక్కుకుంటు జీవనం సాగించేవాడు . కానీ వయసు ఎక్కువ అవ్వడం రిక్షా తొక్కడానికి వయసు సహకరించపోవడంతో గుడి ముందు భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు.

మొదటగా ఈ ఆలయానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. కానీ ఆ తర్వాత తన ఆరోగ్యం చెడిపోయిందని తెలుసుకొని నిత్యం విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.. అల ఎనమిది లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్టుగా ఆలయ అధికారులు తెలిపారు.. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఒక్క ఆలయానికి మాత్రమే కాదు. చాలా ఆలయాలకు అతను విరాళాలు ఇచ్చాడు.

Read also :  అప్పుడు తప్పక లేచిపోయారు.. ఇప్పుడు తప్పు తెలిసి వచ్చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే!

తన జీవితం మొత్తం దేవుడికే అంకితం అని ఒత్తువేసుకున్నాని, ఇలా విరాళాలు ఇవ్వడం వలన భక్తుల్లో నాపై గౌరవం పెరిగిందని 71 ఏళ్ల యాదిరెడ్డి చెపుతున్నాడు.