ఈ వార్త చదివి సిగ్గుపడదాం..!

dowry,jawan,Rajathsan

సహజంగా అయితే పెళ్లి కుదిరంది అంటే అందరు అడిగే ప్రశ్న కట్నం ఎంత ఇస్తున్నారనే.. కట్నం తీసుకోవడం నేరమే..! కానీ ఎవరు తీసుకోకుండా ఉంటున్నారు.. లక్షలు సంపాదించేవాళ్ళు కూడా కట్నాల కోసం పిక్కుతినేవాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో … ఈ కట్నాల వల్ల చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. చాలా సంసారాలు నాశనం అయ్యాయి.. కానీ ఇప్పుడు మీరు చదివే వార్త మాత్రం మిమల్ని కచ్చితంగా కదిలిస్తుంది.. ఓ వ్యక్తి పెళ్లికి ఆయన మామగారు అక్షరాల 11 లక్షల కట్నాని ఇస్తే వద్దు అన్నాడు దానికి బదులుగా 11 రూపాయల కొబ్బరికాయని తీసుకున్నాడు. వినడానికి వింతగానే ఉన్నా ఇది ముమ్మాటికి నిజం..

ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది. జైపూర్ కి చెందినా జితేందర్ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ నెల ఎనమిదిన వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తండ్రి వరుడుకి పదకొండు లక్షల రూపాయల కట్నాన్ని పళ్ళెంలో పెట్టి ఇవ్వబోయాడు. కానీ ఆ వరుడు మాత్రం వద్దు అని సున్నితంగా తిరస్కరించాడు. అందుకు బదులుగా పదకొండు రూపాయల కొబ్బరికాయను తీసుకున్నాడు

దీనితో ఆ వదువు తండ్రి ఆశ్చర్యపోయాడు. పెళ్లికి చేసిన ఏర్పాట్లు నచ్చక ఇలా అంటున్నాడేమో, లేకా కట్నం సరిపోలేదేమోనని కంగారు పడ్డాడు. కానీ తర్వాత ఆ వరుడు చెప్పిన విషయం తెలుసుకొని మరింత షాక్ అయ్యాడు. ఇంతకి అతను ఎం చెప్పాడంటే ! “తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి రాజస్థాన్‌ జుడీషియల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమవుతోందని, అమె మేజిస్ట్రేట్‌ అయితే అదే తనకు పెద్ద కట్నం అని చెప్పాడు”. జితేందర్‌ భార్య న్యాయశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌. ప్రస్తుతం ఆమె పీహెచ్‌డీ చేస్తోంది. ఆ మాటలు పెళ్లికి వచ్చిన అందరిని కదిలించాయి. ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నందుకు మనం అభినందిద్దాం.. అందులో మనం లేనందుకు సిగ్గుపడదాం…!

Also read:  తన్నుకున్న అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి.. ఎందుకో తెలిస్తే నవ్వడం ఖాయం..

error: