తేజ చీట్ చేసాడు… రంగమత్త పాత్ర అందుకే చేయలేదు… రాశీ షాకింగ్ కామెంట్స్

ఓ తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళాలి అంటే పెద్ద విషయమే.. కానీ హీరోయిన్ రాశీ మాత్రం అంతటి స్థానాన్ని సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు పెట్టిన రాశీ హీరోయిన్ గా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది.. శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, వడ్డే నవీన్ జగపతిబాబు, లాంటి హీరోలతో కలిసి నటించింది. అంతేకాకుండా రవితేజ, మహేష్ బాబు లాంటి నటులతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంది.

తాజాగా ఈటీవీ లో ప్రసారం అయ్యే అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న రాశీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అందులో భాగంగా తన చిన్నప్పుడు హీరో వెంకటేష్ లేదా రాజీవ్ గాంధీని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అనే చెప్పెదట.. ఇక పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత సినిమాలో అవకాశం రావడానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కారణం అని చెప్పుకొచ్చింది రాశీ.. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ కి జోడిగా రాశీ అయితే బాగుంటునని సురేఖ సూచించారట… !

ఇక దర్శకడు తేజ దర్శకత్వంలో చేసిన నిజం సినిమాలో భాగంగా గోపిచంద్, నేను లవర్స్ అని మధ్యలో విలన్ వస్తాడని చెప్పి నా పాత్రను పూర్తిగా నెగిటివ్ గా చూపించారని చెప్పుకొచ్చింది రాశీ.. ఇక రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ రాశీ ని సంప్రదించాడట.. ! కానీ ఆ సినిమాలో పాత్రను పరిచయం చేసే క్రమంలో పిండి రుబ్బుతూ మోకాళ్ళ పై వరకు చీర ఉంటుంది. దీనితో నేను ఆ పాత్రను చేయాలను అని ఒకవేళ చేసిన ఆ పాత్రకు నేను న్యాయం చేయలేను అని రాశీ చెప్పుకొచ్చారట..!

Also read: Biggboss3 హోస్ట్ గా నాగార్జున అట్టర్ ప్లాప్… !

error: write your own !