తన్నుకున్న అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి.. ఎందుకో తెలిస్తే నవ్వడం ఖాయం..

Sooryavanshi, Rohith Shetty, Katrina Kaif, Karan Johar, Akshay Kumar

న్యూస్ ని న్యూ సెన్స్ చేస్తున్నారు అంటే బహుశా ఇదేనేమో…! జరిగిన వార్తను ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయకుండా ఓ వెబ్ సైట్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆ వెబ్ సైట్ కి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని అనుకున్న ఆ హీరో, దర్శకుడు రాసిన వార్తను లైవ్ గా ప్రజెంట్ చేశారు.. దీనితో సదరు వెబ్ సైట్ కి దూల తీరిపోయింది.

హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘సూర్యవంశి’ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్. రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా అక్షయ్ కుమార్‌కి, దర్శకుడు రోహిత్ శెట్టికి మధ్య గొడవ జరిగి, ఇద్దరు కొట్టుకున్నారని బాలీవుడ్ కి చెందిన ఓ వెబ్‌సైట్ వార్త రాసి హల్ చల్ చేసింది.

మళ్లీ ఈ తప్పడు వార్తకు బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓ తోక తగలిచింది.. సినిమా వాళ్లే ఎం చేస్తారు.. చూసి ఊరుకుంటారు. మరి కాకపోతే ఇది ఫేక్ న్యూస్ అని వదిలేస్తారు అని అనుకున్నారు కావచ్చు… కానీ రోహిత్ శెట్టి , అక్షయ్ కుమార్ కలిసి ఆ వెబ్ సైట్ గట్టి స్ట్రోక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వెబ్ సైట్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.. ఇంతకీ వారు ఎం చేశారంటే.. ?

అసలే సినిమా వాళ్ళు కదా న్యూస్ రాసిన వాళ్ళ కంటే క్రియేటివ్ గా అలోచించి ఓ మైండ్ బ్లోయింగ్ వీడియోను చేసి ట్విట్టర్ లోకి వదిలారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్ కత్రినా కైఫ్ స్మార్ట్ ఫోన్ లో ఆ తప్పుడు వార్తను చూపిస్తూ ‘‘వార్త చూశారు కదా, అయితే ఇప్పుడు అక్షయ్, రోహిత్ కొట్టుకోవాలి. చూడండి నిజంగానే కొట్టుకుంటున్నారు’’ అని మొదలుపెట్టింది.. ఆ తర్వాత ఒక డోర్‌లో నుంచి రోహిత్.. మరో డోర్‌లో నుంచి అక్షయ్ దూసుకొచ్చారు.

Also Read : RTC ని కాపాడకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి  ఆలోచించండి..!!

ఇద్దరు ఒకరిని ఒకరు బాదుకున్నారు. మధ్యలో చాలా మంది వచ్చి వారిని వీడదీశారు.. బాగా కొట్టుకున్న ఇద్దరు అలిసిపోయి కింద పడిపోయారు.. ఇదంతా సినిమా సెట్లోనే చేశారు. ఈ ఒక్క వీడియోతో సదరు వెబ్ సైట్ ని మళ్లీ నోరెత్తకుండా చేశారు. ఇప్పుడు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అక్షయ్ ని పొగుడుతుండగా, ఆ వెబ్ సైట్ ని ఉతికి అరేస్తున్నారు…

error: