మీడియమా మిడిమిడి ఙ్ఞానమా..!! ఏది అవసరం ఎందుకా అవసరం..!!

ఏ మీడియంలో చదివిన వారికి ఆ బాష బాగా వస్తుందనుకోవడం భ్రమ. తెలుగు మీడియంలో చదివే వారికి తెలుగు అంత బాగా వస్తే తెలుగు సబ్జెక్ట్ ని ప్రత్యేకంగా ఎందుకు భోధిస్తున్నారు.. ఇంగ్లిష్ మీడియంలో చదివే వారికి ప్రత్యేకంగా ఇంగ్లిష్ సబ్జెక్ట్ ను ఎందుకు బోధిస్తున్నారు.!

ఏ బాషనైనా, ఏ విషయాన్నైనా అవసరం నేర్పిస్తుంది. అవకాశం దానికి సహాయపడుతుంది. నేను తెలుగు మీడియంలో చదివా కాబట్టి నాకు ఇంగ్లిష్ రాదు అనుకోవడం ఇంగ్లిష్ మీడియంలో చదివాను కాబట్టి తెలుగు రాదనుకోవడం కూడా కరెక్ట్ కాదు.అది మానసిక వికాసం మీద , మేధో సామర్థ్యం మీద,శారీరక మానసిక పరిస్థితుల మీద,సామాజిక నేపథ్యం మీద తల్లిదండ్రుల జీన్స్ మీద అవసరం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

సైన్స్ నేర్చుకునేవారికి టర్మినాలజీ అవసరం. వాక్య నిర్మాణ క్రమం అవసరం. ఇవి ఇంగ్లిష్ మాతృ బాష కలిగిన వారైనా సరే నేర్చుకోవాల్సిందే..! అసలు ఈ రోజు ఇండియాలో తమ మాతృబాషలో చదివిన వారే అత్యంత అధ్భుతంగా ఇంగ్లిష్ లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. అతి ఎక్కువ మంది స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసెస్ ని ఎక్కువ ఎఫెక్టివ్ గా చెప్తున్నది కూడా వీరే..!ఇంకో విషయం చెప్తాను. ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాడు ధైర్యంగా తప్పులు మాట్లాడతాడు. మాతృబాషా మీడియంలో చదివిన వాడు భయపడుతూ అయినా సరే కరెక్ట్ గా మాట్లాడతాడు. ఇది నేను చాలా మందిలో గమనించాను.

ఇంగ్లిష్ మీడియంలో చదివిన ఎక్కువ మంది కేవలం మానేజ్ చేస్తారు.ఈ మానేజ్మెంట్ తెలియక మాతృబాష లో చదివిన వారు మాట్లాడ్డమే మానేస్తారు.అందుకే ఇంగ్లిష్ అంటే ఏదో భయంకరైన జబ్బు అనో..లేదా అది మనలాంటి వారికి ఎక్కుడ వస్తుందనో ఫోబియా వలననే నేర్చుకోలేకపోతున్నారు.

లైట్ గా ఇంగ్లిష్ వచ్చిన వారి ముందు అసలు రాని వారి ముందు , కొంచెం ఎక్కువ ఇంగ్లిష్ వచ్చిన వాడు అనర్గళంగా మాట్లాడగలడు. అయితే ఇదే వ్యక్తి బాగా పేరున్న ఇంగ్లిష్ ప్రొఫెసర్ ముందు మాట్లాడలేడు.ఈ ప్రొఫెసర్ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న మరొక ప్రొఫెసర్ ముందు మాట్లాడలేడు. ఇదంతా కేవలం ఫోబియా..!!

Also Read :  మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి

ఇక మొత్తం ఇంగ్లిష్ మాత్రమే మాట్లాడే సమాజంలో తెలుగు గాని ఇంక వేరే బాష గాని మాట్లాడితే ఆశ్చర్యంతో చూస్తారు. అధ్భుతమని చప్పట్లు కొడతారు.తెలుగులో మాత్రమే మాట్లాడే సమాజంలో ఇంగ్లిష్ మాట్లాడితే ఆశ్చర్యపోతారు. అయితే ఈనాడు ఇంగ్లిష్ లో కమ్యూనికేట్ చేయడం అనేది ఖచ్చితమైన అవసరం.

ఇంగ్లిష్ బాగా నేర్చుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ లో హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ లోనో టీచర్ గానో పని చేయగలడు.అదే సైన్స్ ని నేర్చుకుంటే కనీసం ఒక శాస్త్ర వేత్త అయినా కాగలడు..!! కనుక ఏ మీడియంలో నైనా చదువు చెప్పించుకోండి కాని భారత్ నుండి ఏదైనా ఒక్కటి కనిపెట్టే శాస్త్రవేత్త తయారయ్యేలా చెప్పనివ్వండి..!! దీనికి సైన్స్ లాబ్స్ మ్యాథ్స్ లాబ్స్ ని లైబ్రరీ లను పాఠశాలకు ఇవ్వమనండి..ఫుల్ స్టాఫ్ ని ఇవ్వమనండి.

మీడియం మార్చడంలో పెద్ద గొప్ప ఏముంది..అదే పిల్లలు అదే టీచర్లు అదే భోధన..పుస్తకాల అట్ట మారుతుంది. దాంట్లోని బాష మారుతుంది .చెప్పే విధానం మారుతుందా..!! స్కూల్ నేమ్ బోర్డ్ మీద ఇంగ్లిష్ మీడియం అని రాయడం తప్ప ఏమీ మారదు.70 సంవత్సరాలుగా పేదవాడి కోసమే చట్టాలు చేస్తున్నారు..అయినా వాడేమైనా మారాడా..ఇది కూడా అంతే..మార్చాల్సిన వాటిపై మారాల్సిన వాటిపై దృష్టి పెట్టడం మంచిది.

ఇంగ్లిష్ మీడియం లో చదివేవారికి టై బెల్ట్ బూట్లు తొడుక్కుని టక్ చేసుకుని హాయ్ అంకుల్ హెలో ఆంటీ అనేంత ఆనందాన్ని కూడా ప్రభుత్వం కల్పించదు.ఇవి జరగాలంటే టీచర్లు రోడ్ల మీద పడి బిచ్చమెత్తాల్సిందే..! ఈనాడు ఇంగ్లిష్ మీడియంలో బోధించాల్సిందే అని పట్టు పట్టేవారు వాలంటీర్లని ఏర్పాటు చేసి జీతాలు ఇవ్వడంపై దృష్టి పెట్టకపోయినా కనీసం ఈ యూనిఫాం విషయంలో అయినా ఆర్థిక సహాయం అందించాలని మనవి.

ఇంకో విషయం ఏంటంటే తెలుగు మీడియం సైన్స్ పుస్తకాలలో తెలుగు టర్మినాలజీగా పిలవబడే సంస్కృత టర్మినాలజీతో పాటు ఇంగ్లిష్ టర్మినాలజీ కూడా ఇస్తున్నారు.అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లో ప్రతీ పాఠంలో విస్తృత మైన విషయ పరిఙ్ఞానం అవసరమైన టాపిక్ దగ్గర QR CODE ఇస్తున్నారు. దీని మీద మొబైల్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా ఆ టాపిక్ మీద క్లాస్ రూంలో చూపించలేని వాటిపై వివరణలతో పాటు వీడియో లెసన్స్ కూడా ఉంటాయి.ఈ పని మీద పరిశోధన ఆంధ్రప్రదేశ్ లో పూర్తైంది.తెలంగాణలో నడుస్తుంది.కనుక మీడియం గురించి ఒకర్నొకరు దూషించుకోకపోతే ఆల్ హాపీస్..!!

Krishna korivi

error: write your own !