Cinema, Trending

వామ్మో వర్షణీ.. అందరి ముందే అభిమాని బుగ్గ కొరికేసింది

varshini,anchor,patas

తెలుగు బుల్లితెర యాంకర్ లలో సుమ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంటే ఆ తర్వాతి స్థానంలో అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతమ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా మరికొందరు యాంకర్స్ కూడా ఉన్నారు. అందులో వర్షణీ ఒకరు.. ఢీ జోడిలో సుధీర్ టీం లో ఉండే వర్షణీ అందంతో పాటు ఇటు యాంకరింగ్ తో ఆకట్టుకుంటు మంచి పేరు తెచ్చుకుంటుంది.

పాపులర్ అవ్వాలి అనుకుంటున్నారో ఏమో కాని లైవ్ లొనే హద్దులు దాటుతూ రెచ్చిపొతున్నారు. తాజాగా పటాస్ షో లో శ్రీముఖి ప్లేస్ లో కనిపిస్తున్న ఈ భామ రీసెంట్ గా జరిగిన ఓ ఎపిసోడ్ లో భాగంగా ఓ అభిమానిని స్టేజ్ పైకి పిలిచి ఎంత బాగున్నవో అంటూ అతని బుగ్గను కొరికేసింది.

Also read : డిస్కోరాజా టీజర్ : రవితేజ మరో ప్రయోగం.. ఈసారి వర్కౌట్ అవుతుందా?

దీనితో అక్కడ ఉన్నవాళ్లు మాత్రమే కాదు షో ని చూస్తున్న ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీకు ఎంత నచ్చితే మాత్రం ఏంటి ఈ పిచ్చి పని అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.!

https://www.youtube.com/watch?v=9rNQ5v-XELQ

Comments are Closed

Theme by Anders Norén