బూతు సినిమాలు తీసే నువ్వు కూడా నీతులు చెబుతున్నావా? ఛీ ఛీ | jathara.com

బూతు సినిమాలు తీసే నువ్వు కూడా నీతులు చెబుతున్నావా? ఛీ ఛీ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు రెండు ఒకటే.. ఒకే కథాంశంతో తెరకెక్కాయి.. ఇందులో అర్జున్ రెడ్డి స్టేట్ మూవీ కాగా, కబీర్ సింగ్ రీమేక్… రెండు సినిమాలు భారీ హిట్టును అందుకున్నాయి.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమాలు తెరకెక్కాయి.. అయితే ఈ సినిమాలపై విమర్శలు కూడా బాగానే తలెత్తాయి.. సినిమాలో మహిళలను కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, హీరో పాత్ర ఎలాంటి గమ్యం లేకుండా, కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని చాలా మంది విమర్శించారు.

Read also :  మన సదువులు గిట్ల అయితే ఎట్లా?

ఇది ఇలా ఉంటే తాజాగా షాద్ నగర్ శివారులో ఓ యువ వైద్యురాలు అత్యంత దారుణంగా హత్య చేయబడిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన పై యావత్ దేశం స్పందిస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఏకంగా బహిరంగంగా ఉరి తీయలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ వంగా ఈ ఘటనపై స్పందించాడు. తన ట్విటర్ ఖాతాలో ‘‘సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి భయం ఒక్కటే మార్గం. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి పని చేసేవారిలో వణుకు పుట్టించాలన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రతి అమ్మాయికి భరోసా అవసరం’ అని సందీప్‌ ట్వీట్‌ చేశారు.

సందీప్ వంగా చేసిన ఈ ట్వీట్ పైన సెలబ్రిటీలతో పాటు అటు నెటీజన్స్ కూడా స్పందిస్తూ విమర్శిస్తున్నారు.. ఆర్జున్ రెడ్డి’ , కబీర్ సింగ్’ లాంటి సినిమాలు నిర్మించిన మీరు భయం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటూ ఒక నెటిజెన్ విమర్శిస్తే, ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య కబీర్‌ సింగ్‌లోని ఓ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ సందీప్‌కు చురకలంటించే ప్రయత్నం చేశారు. ‘మీరు చెబుతున్న ఆ భయం.. మీ సినిమాలో ఆమె (హీరోయిన్‌)ను కొట్టకుండా ఆపగలిగిందా’ అని పేర్కొన్నారు.

Read also :   'అల వైకుంఠపురములో ' సినిమాలో ఇవి గమనించారా?

Also read : శవాన్ని కూడా వదల్లేదు. చనిపోయాక కూడా మళ్లీ అత్యాచారం…

బూతు సినిమాలు చేసే మీరు ఇలా నీతులు మాట్లాడడం ఏమి బాలేదు అంటూ మరో నెటీజన్ పోస్ట్ పెట్టాడు.. ఇక చివరగా సందీప్ వంగా దీనిపైన స్పందిస్తూ .. ఈ ఘటన దురదృష్టకరమని.. ఆ యువతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. ఎవరినీ చంపమని తన సినిమా చెప్పలేదని, ‘కబీర్ సింగ్’ గానీ, ‘అర్జున్ రెడ్డి’ గానీ హత్యలను ప్రోత్సహించేలా తెరకెక్కించలేదని సందీప్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నాడు.

Read also :  స్వయంగా హీరో అర్జున్ తో మొక్కలు నాటించిన రోజా