Cinema, Trending

ఆది నీకు సిగ్గుందా? కామెడీ షోలో జాఫర్ సీరియస్ క్వశ్చన్

హైపర్ ఆది, జాఫర్, tv9 jaffar, jaffar babu, Jaffar, hyper Aadi, aadavari partylaki arthale verule

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈటీవీలోని మల్లెమాల ప్రొడక్షన్ ఆడవారి పార్టీలకి అర్ధాలే వేరులే అనే కామెడీ షో చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 9.30 గంటలకు ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి వరుస ప్రోమోలను విడుదల చేస్తూ సందడి చేస్తోంది.

ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు ప్రోమోలు విడుదల చేయగా తాజాగా మూడో ప్రోమోను విడుదల చేశారు. అయితే ప్రోమోలో రోజా, కొరియోగ్రాఫర్ జానీ, యాంకర్ వర్షణీ, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఆది, సుధీర్ తమదైన పంచులతో నవ్వులు పూయించారు. ఇలా సందడిగా జరుగుతున్న ప్రోమో చివరలో టీవీ జర్నలిస్ట్ జాఫర్ ఎంట్రీ ఇచ్చి షో ని సీరియస్ గా మార్చేశాడు.

ప్రోమో చివరలో హైపర్ ఆది,రోజా, సుడిగాలి సుధీర్ లతో కలిసి జాఫర్ ముఖాముఖి నిర్వహించాడు. అందులో భాగంగా హైపర్ ఆదిని సూటిగా ఓ ప్రశ్నని సందిస్తూ,  ‘కత్తి మహేష్ అనే వ్యక్తి గురించి బాడీ షేమింగ్ చేశారు.. మీకసలు సిగ్గుందా?’ అని ప్రశ్నించాడు. దీనితో అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దానికి ఆది ఎదో సమాధానం చెబుతున్నట్టుగా ప్రోమోలో చూపించారు.

Also Read : ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ బీజేపీని దెబ్బతీసిందా?

ఇక ఎమ్మెల్యే రోజా దగ్గరికి వచ్చి మీరు ప్రజా సేవ కంటే టీవీ షోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అడగగా, రోజా ఎదో సమాధానం ఇస్తూ కనిపించింది. సరదాగా సాగుతున్న షోలో జాఫర్ సీరియస్ క్వశ్చన్ లతో వారిని ఇబ్బంది పెడుతూ చూస్తున్న వారికి షాక్ కి గురి చేస్తూ సందడిని కాస్తా సీరియస్ గా మార్చాడు.. మరి జాఫర్ అడిగిన విషయాలకు ఆది, రోజా ఎం సమాధానం చెప్పారో చూడలంటే డిసెంబర్ 31 రాత్రి వరకు ఆగాల్సిందే..

Comments are Closed

Theme by Anders Norén