చిరంజీవి కంటే ముందే ఉయ్యాలవాడ పాత్రలో బాలీవుడ్ నటుడు..

భారీ బడ్జెట్ తోనే కాదు.. భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విడుదలైంది… మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి రామ్ చరణ్ ఎక్కడ కూడా రాజీపడకుండా నిర్మించారు.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.. సినిమాకి ఫస్ట్ షో నుండే మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా సైరా ఎక్కడ ఆగకుండా దూసుకుపోతుంది.

బ్రిటిష్ వాళ్లకి నిద్రపట్టకుండా చేసిన తొలి స్వాతంత్ర సమరయోధుడుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రలోకి ఎక్కారు. కానీ ఆయన గురించి ఎవరికి పెద్దగా తెలియదు. అందుకే ఆయన కథకి కమర్షల్ ఎలిమెంట్స్ జోడిస్తూ సైరాగా సినిమాని తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి అద్భుతంగా నటించారు. ఆయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రని చిరు కంటే ముందు బాలీవుడ్ నటుడు మేకా రామకృష్ణ పోషించారు..

Meka ramakrishna,uyyalawada narasimha reddy,sheria,chiranjeevi

1997 లో దూరదర్శన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పై సీరియల్ ని చిత్రీకరించారు. ఇందులో మేకా రామకృష్ణ టైటిల్ రోల్ పోషించారు. ఈయన రాజమౌళి బాహుబలి సినిమాలో అనుష్కకి అన్నయ్యగా నటించారు. ఈ సీరియల్ కి పి. ఉదయ్ కుమార్ దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించారు. అంతేకాకుండా సినిమాకి ఫోటోగ్రఫీని అందించారు. ఎలాంటి టెక్నిషన్స్ ,విజువల్ ఎఫెక్ట్స్ లేకున్నా సీరియల్ ని బాగానే చిత్రీకరించారు. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.