Trending

అప్పు చేసి ఐన సరే EMI లు కట్టుకొర్రి.. లేకపోతే దూలతీరుద్ది!

EMI

EMI

ఈ మూడు నెలలు నిజంగా EMI లు చెల్లించవలసిన అవసరం లేదా..!! హాయిగా గుండె మీద చేయేసుకుని నిద్రపోవచ్చా..!!

1.3.2010 నుండి 31.5.2020 వరకు మూడు నెలల పాటు తీసుకున్న లోన్ పైన చెల్లించే EMI లను వాయిదా వేసుకునే గొప్ప సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పించాయి. ఈ కాలంలో 29.2.2020 వరకు ఉన్న ఔట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ కు వడ్డీని కలిని 31.3.2020 వరకు లెక్క గడతారు.

మరి ఈ మార్చి నెలలో చెల్లించాల్సిన EMI ను చెల్లించనందుకు ఈ ఎమౌంట్ ను కూడా బ్యాంకులు అప్పుగా భావించి వాటి మీద కూడా వడ్డీని లెక్క గట్టీ 31.3.2020 రోజున అసలు+అసలు మీద వడ్డీ+EMI మీద వడ్డీని కలిపి ఆ మొత్తాన్ని 1.4.2020 న అసలుగా తీసుకుంటారు .

మళ్ళీ ఈ మొత్తంపై 30.4.2020 వరకు వడ్డీని లెక్కగడతారు. తిరిగి ఏప్రిల్ లో చెల్లించాల్సిన EMI మీద కూడా వడ్డీ లెక్కగడతారు.

ఈ మొత్తాన్ని 1.5.2020న చెల్లించాల్సిన అసలుగా పరిగణించి 31.5.2020 వరకు దీని మీద వడ్డీ లెక్కగడతారు. మళ్ళీ ఆ నెల చెల్లించాల్సిన EMI కు కూడా వడ్డీ లెక్కగడతారు.ఈ మొత్తాన్ని 1.6.2020 న అసలు గా పరిగణిస్తారు.

అయితే ఈ మూడు నెలలు EMI చెల్లించనందుకు ఖాతాదారులకు దక్కే గొప్ప ప్రయోజనం ఏంటయా అంటే వీరు EMI లు కట్టకున్నా పీనల్ ఛార్జెస్ ఉండవు.. మరియు వీరి ఖాతాలను Non Profitable Asset గా పరిగణించరు. తిరిగి CIBIL స్కోర్ లో ఈ EMI వాయిదాల ఎగవేతను నమోదు చేయరు.

అంతేకాని మైకుల ముందు చెప్పినట్లు ఈ మూడు నెలల వడ్డీ మాఫీ కాదు.. EMI లకు రిలాక్స్ ఇవ్వడం మంచిది కూడా కాదు..

ఒక ఉదాహరణ చూద్దాం…

29.2.2020 న అసలు 100000
EMI 10000
ఇప్పుడు ఈ EMI మారటోరియం అంటే వాయిదాను మూడు నెలలు వాడుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం.

31.3 2020 వరకు లక్షపై వడ్డీ 2000(అనుకుందాం)
మరియు EMI పై వడ్డీ 200 ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం 1,02,200
ఇప్పుడు 1.4.2020 న అసలు 1,02,200 దీనికి 30.4.2020 వరకు వడ్డీ 2,044రూపాయలు.
EMI పై వడ్డీ 200
ఇప్పుడు మొత్తం 1,04,444..
1.5.2020 న అసలు 1,04,444.
దీనికి వడ్డీ 2088
EMI కి వడ్డీ 200
31.5.2020 న మొత్తం 106732

అంటే ఇక్కడ EMI లకు వడ్డీ..మరియు అసలు మీద వడ్డీకి వడ్డీ చెల్లించాలి.. కనుక బయట అప్పు చేసైనా సరే EMI లు చెల్లించడం మంచిది..ఇది కేవలం హోమ్ లోన్ గురించే ఇక పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్లు, బిజినెస్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్స్ తీసుకున్న వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండబోతుంది.

Krishna korivi

Also Read:  మా దగ్గర ఒక్క కరోనా కేసు లేదు.. లాక్ డౌన్ ఎత్తేస్తాం..

Comments are Closed

Theme by Anders Norén