సునీల్ త్రివిక్రమ్ సలహా తీసుకున్నావా?

sunil, Suhas, Trivikram srinivas, Vilan, Cinema, comedian, Latest Telugu News, Tollywood News

నటుడు అనేవాడు కేవలం ఒక రకమైన పాత్రలకి మాత్రమే పరిమితం కావాలని అనుకోడు. అన్నిరకాల పాత్రలను పోషించి పరిపూర్ణమైన నటుడిగా ఆవిష్కరించబడాలని అనుకుంటాడు. అందులో తప్పులేదు. ఇప్పటికే కమెడియన్ గా ఫుల్ సక్సెస్ అయిన సునీల్ హీరోగా మారి కొన్ని సినిమాలు అయితే చేశాడు. మొదట్లో బాగానే సక్సెస్ లు వచ్చినప్పటికీ ఆ తర్వాత వరుస పరాజయాల సునీల్ ని వెంటాడాయి.

మళ్లీ తనకు కలిసొచ్చిన కమెడియన్ గానే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. మళ్లీ ఏమైందో కానీ కమెడియన్ నుంచి విలన్ గా మారబోతున్నాడు. విజేత, మజిలీ, డియర్ కామ్రేడ్ సినిమాలతో మంచి నటుడు అనిపించుకున్న సుహస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కలర్ ఫోటో’ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు సునీల్.. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు సడన్ గా సునీల్ ఇలా రూటు మార్చడంతో అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి.

సునీల్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకునే ముందు తన స్నేహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా తీసుకున్నాడా లేదా అన్న చర్చ ఆయన అభిమానుల్లో కలుగుతుంది. ఎందుకంటే సునీల్ ని స్టార్ కమెడియన్ చేసింది త్రివిక్రమే. హీరోగా చేస్తానంటే కూడా సునీల్ ఎంకరేజ్ చేసింది కూడా త్రివిక్రమే. ఎందుకంటే హీరోగా ఫ్లాప్ అయినప్పటికీ మళ్లీ కమెడియన్ గా నిలబెట్టే సత్తా త్రివిక్రమ్ కి ఉంది. ఆ ధీమాతోనే సునీల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.

ఇక హీరోగా సునీల్ ఎలాగూ ప్లాప్ అయ్యాడు కాబట్టి మళ్లీ తన సినిమాలో అవకాశాలు ఇచ్చాడు త్రివిక్రమ్. కానీ ఇప్పుడిలా సునీల్ ఆ రూట్ ని మార్చి విలన్ గా చేస్తున్నాడు. మరి దీనికి త్రివిక్రమ్ ఓకే చెప్పాడా లేదా అన్నది పెద్ద హాట్ టాపిక్.. ఎందుకంటే హీరో నుండి కమిడియన్ గా మారిన సునీల్ కి అవకాశలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇప్పుడు విలన్ గా ఫెయిల్ అయితే మళ్లీ సునీల్ పరిస్థితి ఏంటి అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఈ ఏడాది ఏసీబీ లిస్టులో రెవెన్యూశాఖే టాప్…!

error: write your own !