Trending

మరక మంచిదే.. కరోనా మంచిదే!

Coronavirus

Coronavirus

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఓ మహమ్మారి .. ప్రస్తుతం దీనికి అయితే మందు లేదు.. ఫ్యూచర్ లో వస్తదేమో అనే నమ్మకం అయితే ఉన్నది. మరక మంచిదే అన్నట్టుగా ఈ కరోనా కూడా ఒకందుకు మంచే చేసింది అనుకోవాలి. భ్రష్టు పట్టిన ఈ వ్యవస్థలో చాలా మార్పులను తీసుకువచ్చింది. ఇంతకీ ఈ కరోనా మన మధ్యకి వచ్చి ఎం నేర్పింది. దానివలన మనం నేర్చుకున్న గుణపాఠాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. !

1. సాంప్రదాయాలు

నమస్కారనికి ప్రతి నమస్కారం సంస్కారం..ఇది భారతీయ ఆచారం.. కానీ జనరేషన్ మారింది. ఇంకా ఆచారాలు ఏంటి తొక్క ఏంటి అన్నవాళ్ల మెడలు వంచి మళ్లీ పాత సంప్రదాయం వైపు అడుగులు వేయించింది. ఇప్పడు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సాంప్రదాయాల గురించి మన పెద్దవాళ్ళు చెప్తే వినని వారికోసం అయిన ఇంకా కరోనా బతికి ఉండాలిని అనిపిస్తది.

2.శుభ్రత

కరోనా ముఖ్యంగా శుభ్రతను నేర్పింది. సబ్బులు అరిగిపోయేలా.. శానిటైజర్లు ఐపోయేలా ఒక్కొక్కరు చేతులను కడుగుతున్నారు. ఏమౌతుందిలే అన్న తెంపరితనం పోయింది!.. అందుకే కరోనా ఇంకా బతికి ఉండాలని అనిపిస్తది..

3. మహిళలపై అత్యాచారాలు తగ్గాయి

పొద్దున పేపర్ చూసిన, టీవీలో వార్తలు పెట్టిన మహిళల లపై అత్యాచారాలు.. ఇవే కచ్చితంగా రోజుకు పది వరకు ఉంటాయి. కానీ ఇప్పుడు తగ్గాయి.. ఇంకా చెప్పాలంటే పూర్తిగా తగ్గాయి.. దొంగతనాలు కూడా చాలా వరకు తగ్గాయి.. దీనితో క్రైం రేట్ చాలా వరకు పడిపోయింది. అందుకే కరోనా ఇంకా బతికి ఉండాలని అనిపిస్తది..

4. కన్నోళ్లను, ఊరుని యాదికి చేసింది.

ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులును వదిలేసి పట్నం పోయి బిజీ లైఫ్ గడుపుతున్న బతుకులు మనయి.. కన్నోళ్లను పట్టించుకొన్నంత బిజీ మనం.. కానీ కరోనా ఎక్కడున్న మళ్ళీ మన ఊర్లను యాదికి చేసింది. కన్నోళ్ల దగ్గరకి మనల్ని చేర్చి మనల్ని కనోళ్ళ మొఖంలో సంతోషం నింపింది. అందుకే పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల కోసం అయిన కరోనా ఇంకా బతికి ఉండాలని అనిపిస్తది.

4. తాగుడు బంద్

అసలు తాగకుండా ఉండనివాన్ని కూడా మంచినీళ్లు తాగి ఉండేలా చేసింది ఈ కరోనా. మధ్యపాన నిషేధం అని ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ కుదరని పని ఒక్క కరోనాతో సెట్ అయిపోయింది. ఇలాంటప్పుడే భర్తలు తాగుడుకు బానిసై ఇంటిని పెళ్ళాం ,పిల్లల్ని పట్టించుకోని వాళ్ళ కోసం అయిన కరోనా ఇంకా బతికి ఉండాలని అనిపిస్తది.

5. జంతుబలి

కరోనా ఎక్కువగా జంతువుల నుంచే వస్తది అనే తెల్వడంతో అందరూ నాన్ వెజ్ తినడం మనేషిర్రు.. రైతులు పండించిన కూరగాయలు వైపు మొగ్గు చూపిర్రు.. నిజానికి జంతుబలి మహాపాపం అని తెలిసిందే.. కానీ ఇప్పుడు కరోనా మన మధ్యకి రావడంతో స్వచ్ఛమైన కూరుగాయలనే తింటున్నారు. ఇలాంటప్పుడే కరోనా ఇంకా బతికి ఉండాలని అనిపిస్తది..!

Also Read: మెహర్ రమేష్ తో సినిమాని అనౌన్స్ చేసిన మెగాస్టార్!

Comments are Closed

Theme by Anders Norén