Cinema

పూరి 20 ఏళ్ళ కెరీయర్లో ఇద్దరు స్టార్ హీరోలు మిస్!

Puri Jagannadh

Puri Jagannadh

పూరి జగన్నాథ్.. ఇది పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.. అవును.. టైటిల్ నుంచి హీరో క్యారెక్టర్ వరకు అంత డిఫరెంట్ గా ఉంటాయి.. అందుకే ఇండస్ట్రీలో ‘పూరి హీరో’ అనే పేరు కూడా ఉంది. తక్కువ టైం లో సినిమా తీసి హిట్ ఎలా కొట్టాలో ఇండస్ట్రీకి చూపించిన డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్.. వర్మ స్కూల్ నుంచి వచ్చిన పూరి బద్రి సినిమాతో డైరెక్టర్ అయ్యాడు.. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 2000 వ సంవత్సరంలో విడుదలైంది. పూరికి ఫస్ట్ సినిమానే బంపర్ హిట్.ఎం పూరి.. అనే వాడు ఒకడు ఇండస్ట్రీలోకి వచ్చాడట అనే పేరు వచ్చేసింది.

20ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి స్టార్ హీరోలతో రెండేసి సినిమాలు చేశారు. చాలా మంది హీరోలను పరిచయం చేశారు. చాలా మంది హీరోలకి లైఫ్ ఇచ్చారు. ఇండస్ట్రీకి హిట్స్ చూశారు. డిజాస్టర్లు చూసారు. పూరి తన 20ఏళ్ల కెరీయర్లో అన్ని చేశాడు చూశాడు. కానీ ఓ ఇద్దరు హీరోలతో మాత్రం సినిమాని చేయలేకపోయాడు. వాళ్లే చిరంజీవి, వెంకటేష్.. వాస్తవానికి చిరంజీవి రీఎంట్రీ మూవీ పూరి డైరెక్షన్లో రావాల్సింది కానీ కాంబినేషన్ సెట్ కాలేదు. ఆటోజానీ అంటూ టైటిల్స్ కూడా బయటకు వచ్చాయి..ఇక వెంకటేష్ తో స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచాయి. కానీ ఎందుకో సెట్స్ పైకి వెళ్ళలేదు.. ఫ్యూచర్ లో అయిన వీరితో పూరి సినిమా చేస్తాడేమో లేదో చూడాలి.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : మెహర్ రమేష్ తో సినిమాని అనౌన్స్ చేసిన మెగాస్టార్!

Comments are Closed

Theme by Anders Norén