జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర పక్కన చేసే ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Jabardasth, Chammak Chandra, chammak chandra satya, Adirindi,Etv, Zee Telugu, చమ్మక్ చంద్ర , జబర్దస్త్ సత్య

ఓ పదిహేను ఎపిసోడ్స్ చేసి ఆపేద్దాం అనుకున్న జబర్దస్త్ షో అన్నింటినీ పక్కకి నెట్టేసి టాప్ కి చేరుకుంది. టీఆర్పీలో ఈ షోని బీట్ చేసింది మరొకటి లేదనే చెప్పాలి.. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. అందులో ఒకడు చమ్మక్ చంద్ర..

లేడీస్ స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో చంద్రకి మించిన వారు లేరని చెప్పాలి. మొదటినుండి చంద్ర చేసే స్కిట్స్ అన్ని ఇవే.. కానీ ఎప్పటికి కొత్తగానే ఉంటాయి. నవ్విస్తాయి. ఇప్పుడు చంద్ర ఆ షో కి గుడ్ బై చెప్పేసి జీ తెలుగులో వచ్చే అదిరింది ప్రోగ్రాంలో చేస్తున్నాడు. అక్కడ కూడా అవే స్కిట్స్ చేస్తున్నాడు.. అయితే ఎప్పుడు చంద్ర పక్కన ఓ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది..ఇంతకీ ఆమె ఎవరు అన్న డౌట్ అందరిలో ఉంది.

jabardasth satya sri కోసం చిత్ర ఫలితం"

Also Read : పాలిటిక్స్ వల్ల చిరంజీవి నేర్చుకున్న నీతి ఏంటి?

చంద్ర టీంలో చేసే అమ్మాయి గురించి అందరికి అరుదుగా తెలుసు. ఆ అమ్మాయి పేరు సత్య శ్రీ.. కొన్నేళ్లుగా చంద్ర టీంలోనే రెగ్యులర్‌గా చేస్తూ వస్తుంది. జబర్దస్త్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది సత్యశ్రీ.. రాజా ది గ్రేట్, ఆర్‌డిఎక్స్ లవ్ లాంటి సినిమాల్లో కూడా నటించినా సత్యకు గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంతమంచివాడవురా సినిమాలో నటించింది. మరి ఈ సినిమా అయిన ఆమెకి సరైనా గుర్తింపును తీసుకువస్తుందా లేదా అన్నది చూడాలి..

error: write your own !