Trending

Whatapp  అడ్మిన్‌లకు వార్నింగ్ ..కరోనా పై ఫేక్ న్యూస్ లు పోస్ట్ చేస్తే అంతే సంగతులు.. ఇందులో నిజమెంత?

WhatsApp (File photo)

WhatsApp (File photo)

కరోనా వైరస్…  ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి వ్యాధి. ఈ వైరస్ బారినపడి చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి.. అయితే కరోనా వైరస్ గురించి వాట్సప్ గ్రూపులలో మీమీస్‌, జోక్స్‌, ఫేక్‌ న్యూస్‌ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సప్ గ్రూపులలో ఇలాంటివి చేస్తే గ్రూప్‌ అడ్మిన్‌పై సెక్షన్‌ 68, 10, 188 కింద న్యాయపరమైన చర్యలు తప్పవనే మెసేజ్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతుంది… ఇంతకీ ఆ సందేశంలో ఏముందంటే… !

Also Read : ఈని చేతులకి జట్టలువుట్టా… ! వృద్ధురాలి  పెన్షన్ డబ్బులు ఎత్తుకపోయిండు!

వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లందరికీ విన్నపం. రెండు రోజుల పాటు మీ వాట్సాప్‌ గ్రూప్‌ను మూసేయండి. గ్రూపులోని ఏ సభ్యుడైనా పొరపాటునైనా కరోనాపై జోక్స్‌, మీమీస్‌ షేర్‌ చేస్తే అడ్మిన్‌, ఆ గ్రూప్‌లోని సభ్యులపై సెక్షన్‌ 68, 140, 180కింద చర్యలు తప్పవు. అందుకు అనుగుణంగా గ్రూప్‌ అడ్మిన్లు మసలుకోవాలని మనవి చేస్తున్నాం’’ అంటూ ఓ సందేశం వైరల్ గా మారింది దీనీతో చాలా మంది గ్రూప్‌ అడ్మిన్లు సెట్టింగ్స్‌ మార్చేశారు. కేవలం అడ్మిన్లు మాత్రమే సందేశాలు పంపేలా మార్పులు చేశారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది!

fact check

ఇదో ఫేక్ న్యూస్.. దీనికి సంంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇదే విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టత ఇచ్చింది.

Comments are Closed

Theme by Anders Norén