అప్పుడు తప్పక లేచిపోయారు.. ఇప్పుడు తప్పు తెలిసి వచ్చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే! | jathara.com

అప్పుడు తప్పక లేచిపోయారు.. ఇప్పుడు తప్పు తెలిసి వచ్చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే!

వధువు తల్లితో వరుడు తండ్రి పారిపోయిన ఘటన గురించి అందరికీ తెలిసిందే.. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. తమ కుమారుడు, తమ కుమార్తె పెళ్ళికి ముందు పారిపోయిన ఈ జంట వాలెంటైన్స్ డే కి ముందు తిరిగి వచ్చారు.

Read also :  71 Republic day సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం..

అప్పుడు తప్పక పారిపోయారు ఇప్పుడు తప్పు తెలుసుకుని వచ్చారనీ సంతోషిద్దామనుకుంటే ఈ కేసులో మళ్లీ కొత్త ట్విస్ట్ ఏర్పడింది.మూడు వారాలు ఎక్కడికో వెళ్లిన ఈ జంట సమాజం ఎం అనుకుంటుందో అని తప్పు తెలుసుకొని వచ్చారు. పారిపోయిన ఈ జంటలో వరుడు తండ్రి తన కుటుంబంతో కలిసి ఎంచక్కా ఇంటికి వెళ్లగా, వధువు తల్లికి మాత్రం చేధు అనుభవం ఎదురైంది. ఇన్ని రోజులు వేరేవారితో వెళ్లిన తనని ఎలా అంగీకరించాలని ఆమె భర్త మొఖం మీదే చెప్పేసాడు.. దీనితో ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

గుజరాత్ లోని కాటర్గామ్ ప్రాంతానికి చెందిన వీరు ఇరుగుపొరుగు వారే కానీ వరుని తండ్రికి, వధువు తల్లికి ఎప్పటినుంచో పరిచయం కూడా ఉంది.  ఎదో పెళ్లిలో ఒకరిని ఒకరు చూసుకొని ప్రేమలో పడ్డారు కానీ పెళ్లి చేసుకోలేకపోయారు. కానీ చాలా కాలం తర్వాత కలవడంతో రహస్యంగా మాట్లాడుకునేవారు .. ఈ క్రమంలో వారి పిల్లలకి పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కాని తమ పిల్లలకి పెళ్ళి చేస్తే అన్న చెల్లలు అవుతారని పారిపోయారు..

Read also :  ఏపీ ఎమ్మెల్యేలపై తీవ్ర క్రిమినల్ కేసులు.. టాప్‌లో వైఎస్సార్సీపీ.. అందులో జగన్!