Off Beat

భారత్ లో లాక్ డౌన్ ఎలా ఎత్తేయవచ్చు?

lockdown

lockdown

శ్రీలంక,  భారత్  ,  పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ నాలుగు దేశాల జనాభా ప్రపంచ జనాభాలో దాదాపు 21% నుంచి 22%. ఇక్కడ ఉన్న వైద్య సౌకర్యాలు ఆరోగ్యానికి పౌష్ఠికాహారానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. శ్రీలంకలో కొద్దిగా బెటర్..అలానే పేదల శాతం చాలా ఎక్కువ. అయితే ఇప్పటివరకు ఇక్కడ ఉన్న కరోనా కేసుల సంఖ్య 25 వేల లోపే.. మరణాలు వెయ్యి లోపే.. హిందూ పత్రికలో సుబ్రమణ్య స్వామి కూతురు సుభాషిణీ హైదర్ సౌత్ ఏషియాలో కరోనా ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయని ఒక ఆర్టికల్ కూడా రాసారు. దీనికి కారణం వాతావరణంలో మార్పులు ఎండ వేడి కూడా కావచ్చు.అలానే చిన్నతనంలో BCG ఇమ్యూనైజేషన్ వలన ఆ ఇమ్యూనిటీ ఇంకా బాడిలో ఉండిపోవచ్చు లేదా శరీరం తనంతట తానే యాంటీ బాడీస్ తయారు చేయడం వలన కావచ్చు అదీ కాక క్లోరోక్విన్ మాత్రలను చిన్నతనం నుండి తీసుకోవడం వలన కావచ్చు అలానే భారత్ లో అత్యధిక మలేరియా కేసులు ఉండడం వలన National Malaria Eradication Programme పేరుతో ఊర్లలో DDT స్ప్రే చేయడం వలన కూడా కావచ్చు .అయితే ఇవన్నీ ఊహాగానాలు..వీటిని పక్కకు పెడితే ఒకసారి మన డేటాను పరిశీలిద్ధాం

భారత్ లో గత ఐదు రోజుల నుండి కరోనా పాజిటివ్ రేట్ 6.6% ఉంది.అంటే ప్రతి 11రోజుల తర్వాత ఈ శాతం డబుల్ అవుతుంది.నీతి ఆయోగ్ CEO అమితాబ్ ఖాన్ ట్వీట్ ప్రకారం భారత్ లో కరోనా టెస్ట్ చేసిన వారిలో పాజిటివ్ రేట్ 4.1% నుండి 4.7%ఉంది. అంటే వంద మందిని టెస్ట్ చేస్తే నలుగురు లేదా ఐదుగురు మాత్రమే పాజిటివ్ గా ఉన్నారు.రమణ్ గంగా ఖేద్కర్ ,ఛీఫ్ ఎపిడమిక్ ఎపిడిమాలజీ ,ICMR ప్రకారం టెస్ట్ చేసిన వారిలో 4.4% మంది మాత్రమే పాజిటివ్ గా లెక్కతేలుతున్నారు.

అదే అమెరికాలో పాజిటివిటీ రేట్ 19.8%, ఫ్రాన్స్ 41.8%,ఇటలీ 15.1% పాకిస్తాన్ 9.54%(పాక్ లో భారత్ కంటే రెండు రెట్లు టెస్ట్ లు చేయడం కూడా ఒక కారణం)శ్రీలంకలో 5.1%..భారత్ లో ఒక పాజిటివ్ కేస్ కోసం 24మందిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది.అంటే ఇది కమ్యూనిటీ గా స్ప్రెడ్ అవ్వడం లేదని అర్థమౌతుంది.

ఇదీ కేవలం క్లస్టర్ స్ప్రెడ్ మాత్రమే..
జపాన్ 11.7 కి ఒక పాజిటివ్ కేస్
ఇటలీ 6.7కి ఒక పాజిటివ్ కేస్
అమెరికా 5.3కి ఒక పాజిటివ్ కేస్
బ్రిటన్ లో 3.4కి ఒక పాజిటివ్ కేస్

వియత్నాంలో 496కి ఒక పాజిటివ్ కేస్
తైవాన్ 72 కి ఒక పాజిటివ్ కేస్
రష్యా 62 కి ఒక పాజిటివ్ కేస్ నమోదు అవుతుంది.

ఇండియా మరణాలలో 83% కొమార్భిడిటీస్ తో ముడిపడి ఉన్నవే..అంటే ఆల్రెడీ కరోనా వైరస్ కంటే ముందే ఇతర గుండె సంబంధ వ్యాధులు , డయాబెటీస్ లాంటివి శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఉండడంతో వాటికి కరోనా తోడై మరణించారు తప్ప ప్రత్యేకంగా కరోనా వల్లే చనిపోలేదు .

sciencemag.org ప్రకారం వైరస్ అనేది తనంతటతానుగా ఏ అవయవం మీద ప్రభావం చూపదు..ఏ అవయవం అయితే వీక్ గా ఉంటుందో దాని మీదనే ఎక్కువ ప్రభావం చూపుతుంది..సెల్ఫ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది..ఆ వెబ్ లింక్ కింద ఇవ్వడం జరిగింది.

దేశంలో లాక్ డౌన్ వలన వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సఫలమయ్యారనే చెప్పవచ్చు.లాక్ డౌన్ వలన అతి ఎక్కువ మంది పేదలకు నిరక్షరాస్యులకు కూడా సేఫ్ డిస్టేన్స్ లో ఎలా ఉండాలో వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అర్థమైపోయింది..ఇక లాక్ డౌన్ ని ఇంకా కొనసాగిస్తే పేదల జీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది..కనుక ఈ లాక్ డౌన్ ను దశల వారిగా సడలించడమే కరెక్ట్ అనిపిస్తుంది .

అత్యంత రద్ధీగా ఉండే ప్రదేశాలైన సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ,పెద్ధ పెద్ద హోటల్స్ ,రెస్టారెంట్స్ ను ఇంకో నెల పాటు మూసి ఉంచాలి..అలానే భవన నిర్మాణ రంగానికి చెందిన పనులు మరియు వాటికి సంబంధించిన అన్నిషాపులకు , కిరాణం షాపులకు , నిత్యావసర సరుకులు అమ్మే షాపులకు, ఆటోమోబైల్ రంగంలో ఉన్న షాపులకు మరియు ఫ్యాక్టరీలకు మెకానికల్ షాప్స్, పాల ఉత్పత్తుల, స్వీట్ షాప్ లకు అనుమతి ఇవ్వవచ్చును

ఇప్పటికే ఆహార ఉత్పత్తులకు చెందిన రైస్ మిల్స్, డెయిరీ ఫామ్స్ నడుస్తూనే ఉన్నాయి.చికెన్, మటన్ సెంటర్స్ ,కూరగాయల మార్కెట్లు,మిల్క్ సెంటర్స్ ఉదయం 11గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. వాటిని రోజంతా పొడిగించవచ్చు.

అలానే అన్ని ఫ్యాక్టరీలను అందులో పనిచేసే కార్మికులకు తగు రక్షణ సౌకర్యాలను కల్పిస్తామని ఆయా యాజమాన్యాలు హామీ ఇస్తే వాటిని నడిపేందుకు అనుమతి ఇవ్వడం మంచిది. తద్వారా అసంఘటిత కార్మికుల మీద ఒత్తిడి తగ్గుతుంది.

ఇక ప్రజలకు సురక్షిత దూరంలో ఉండి పనిచేయాలని ప్రభుత్వం ప్రతి ఊర్లో ప్రచారం చేయడం వలన లేదా ప్రతి ఊర్లో వారంటీర్ లను నియమించి అవగాహన ఛేయవచ్చు..అలానే అన్ని డిపార్ట్మెంట్ ల ప్రభుత్వ ఉద్యోగులను ఈ ప్రచారానికి వాడుకోవచ్చు.

ఇక మరో ఆరు నెలలపాటు ప్రభుత్వం ఇప్పుడిస్తున్న మాదిరిగానే కుటుంబానికి 1500 రూపాయలను మరియు ప్రతి వ్యక్తికి 12కేజీల బియ్యాన్ని అందించడం ద్వారా ఈ రెండు నెలల నష్టాన్ని పుడ్చుకునే అవకాశం కల్పించినట్లు అవుతాం.అలానే ఈ రెండు నెలలలో నష్టపోయిన కంపెనీలకు ప్రభుత్వం తగిన సబ్సిడీలను కల్పించాలి.అలానే EMI ల మీద,పర్సనల్ , బిజినెస్, హోమ్ లోన్ల మీద వడ్డీని ఆరు నెలల పాటు రద్దు చేయాలి.

అలానే వికలాంగ,వృధ్ధాప్య ఆసరా పెన్షనర్లకు ఒక ఆరు నెలల పాటు 50% అదనంగా పెన్షన్ ఇవ్వడం వలన వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది

ఇక జనం గుంపులు గుంపులుగా ఉండకుండా కేవలం పార్సల్ సౌకర్యం మాత్రమే కల్పిస్తామనే హామీ మీద రోడ్ల పక్కన ఉండే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లను,టీ స్టాల్ లను అనుమతించాలి.

అలానే ఒక నెల పాటు ఇంటికే మద్యం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది..మద్యానికి అలవాటు పడిన వారికి కొంత రిలీఫ్ దొరుకుతుంది.ఇక సిగరెట్ , పాన్ షాప్ లను జూన్ వరకు తెరవకపోవడమే మంచిది.దీని మీద ఆధారపడిన వారిని ప్రభుత్వం మధ్యం సరఫరా కోసం వాడుకుని వారికి జీతం ఇస్తే బాగుంటుంది.

ఇక కరోనా కట్టడి అంటే రోడ్ల మీద వెళ్ళే వారిని బైకులు నడిపే వారిని ట్రాక్టర్ల మీద ఊరికి దూరంగా రోడ్ పక్కన నిలబడి పండ్లూ కూరగాయలు అమ్ముకునే వారిని పోలీసులు తరిమి కొట్టడం కాదు..అది వైద్య పరంగా డాక్టర్ల సలహా మేరకు ప్రజలు పాటించిన లేదా పాటించవలసిన జాగ్రత్తల ద్వారా లేదా రోగులకు డాక్టర్లు అందించిన ట్రీట్మెంట్ ని బట్టీ బయటపెట్టాల్సిన నివేదిక..

అసలు వైద్యపరంగా డాక్టర్లు మాట్లాడాల్సిన చోట పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు..కరోనా కట్టడి గురించి పోలీసులు మాట్లాడుతున్నారూ.ఇప్పుడు జరిగేది కరోనా కట్టడి కాదు.కర్ఫ్యూ..ఈ కర్ఫ్యూ వలన అనుమతించిన ఫ్యాక్టరీలలో పనిచేసే అసంఘటిత కార్మికులు చిన్న చిన్నఉద్యోగులు కూడా భయపడి అసలు పనికే బయటకు రాని పరిస్థితి వస్థుంది.. అప్పుడు దేశంలో ఖచ్చితంగా ఆహార కొరత ఏర్పడి ప్రజల మధ్య ఉన్న సుహృధ్భావ వాతావరణం చెడిపోయి ప్రజల మధ్య వైషమ్యాలు కొట్లాటలు ఏర్పడి లా అండ్ ఆర్డర్ గతి తప్పే అవకాశం కూడా ఉంది. ఇలాంటీ సందర్భంలో కూడా నష్టపోయేది ఖచ్చితంగా పేదవాడే..

కనుక పేద వారిని ఆదుకోవడం ప్రభుత్వ భాధ్యత..దాన్ని మరింత సమర్ధవంతంగా పనిచేసేలా చూసుకోవడం ప్రజల భాధ్యత..

Also Read :  మరక మంచిదే.. కరోనా మంచిదే!

 

Karishna korivi

Comments are Closed

Theme by Anders Norén