Off Beat, Trending

కరోనా ఎఫెక్ట్ … ఐపీఎల్ కి వచ్చే నష్టం ఎంతంటే?

IPL

ఐపీఎల్ … క్రికెట్ దశ దిశ మార్చిన క్రికెట్ లీగ్.. బాల్ బాల్ కి మారే మ్యాచ్, మ్యాచ్ మ్యాచ్ కి మారే టైటిల్ ఫేవరెట్, అప్పటివరకు బోసిపోయిన స్టేడియాలు కళకళ, కోట్లు కుమ్మరించే ఫ్రాంచైజీలు, టీవీలకు అతుక్కుపోయే అభిమానులు… ఇది ఐపీఎల్ అంటే మనకు తెలిసేది.. గత 12 ఏళ్లుగా సజావుగా సాగిన ఐపీఎల్ కి ఇప్పుడు కరోనా కష్టం వచ్చి పడింది..

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ కరోనా ప్రభావం ఇప్పటికే అన్ని రంగాలపైనా పడింది. ఇక ఇప్పటికే క్రికెట్లో పలు సిరీస్ లు కూడా రద్దయ్యాయి. తాజాగా ఐపీఎల్ సీజన్ 13 కూడా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. అప్పటికి కరోనా ప్రభావం తగ్గితే ఐపీఎల్ 13 మొదలవుతుంది. లేకపోతే ఈ ఏడాది అయితే లేనట్టే లెక్క.. మరి ఈ సీజన్ రద్దు అయితే వచ్చే నష్టం ఎంత?
పదివేల కోట్ల నష్టం :

ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అయితే బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్‌‌లకి కలిపి మొత్తంగా రూ.10వేల కోట్లపైనే నష్టపోతోందని తెలుస్తోంది.. ఇక ఐపీఎల్ టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ రూ. 16వేల కోట్లతో ఐదేళ్లకాలానికి ఒప్పందం చేసుకుంది. ప్రతి సీజన్ కి 20% లాభం ఆశిస్తోంది.. ఒకవేళ ఈ ఏడాది దాదాపుగా సీజన్ రద్దు అయితే రూ. 3200 కోట్లని నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుంటే టీవీ వ్యూవర్‌షిప్, డిజిటిల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొంతలో కొంత నష్టాన్ని స్టార్‌స్పోర్స్ తగ్గించుకునే అవకాశం ఉంది.

आईपीएल 2020
వంద కోట్ల యాడ్స్

ఐపీఎల్ ఒకవేళ మొదలై ప్రేక్షకులను అనుమతి ఇవ్వకుంటే టోర్నీలోని ఎనిమిది జట్ల ఫ్రాంఛైజీలకి మొత్తంగా టికెట్ల రూపంలో రూ. 400 కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కారణంగా కొంతమేర నష్టాన్ని ఫ్రాంఛైజీలు పూడ్చుకోనున్నాయి. ఇక ఈ సీజన్ కు ముందే కొన్ని యాడ్స్ కంపెనీలు బీసీసీఐతో దాదాపు 100 కోట్లు పెట్టి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకవేళ ఈ సీజన్ రద్దయితే బీసీసీఐ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
విదేశీ ఆటగాళ్లు లేకపోతే నో !

కేంద్ర ప్రభుత్వం వీసాలను మళ్లీ నిరాకరిస్తే విదేశీ ఆటగాళ్లు టోర్నీలో ఆడే అవకాశం లేదు. ఒకవేళ స్వదేశీ ఆటగాళ్లతో ఈ సీజన్ ని పూర్తి చేద్దాం అంటే అందుకు ఫ్రాంచైజీలు ఒప్పుకోవు… టీం లో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ మ్యాచ్ ను మార్చే సత్తా ఉన్నవారే కావడంతో స్వదేశీ ఆటగాళ్ల తోనే సీజన్ పూర్తి చేస్తామంటే ప్రాంఛైజీలు ఒప్పుకునే ఛాన్స్ లేనే లేదు.. ఏది ఏమైనప్పటికీ కరోనా ప్రభావం తగ్గితే తప్ప ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలవడం డౌటే…!

Also Read : బండి సంజయ్ వైపే కేంద్రం ఎందుకు మొగ్గు చూపింది?

Comments are Closed

Theme by Anders Norén