ప్రియాంకరెడ్డి లాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైతే వెంటనే మీరు ఇలా చేయండి…!

Priyanka

( ఓపిగ్గా చదవండి…వీలైతే షేర్ చేయండి కానీ సమాచారం అందించండి. ప్రియాంకరెడ్డి లాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా చూడండి! )

1. పూర్వ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు అమ్మాయిలకే ఎక్కువగా ఆపదలు వస్తున్నాయి. అది కూడా కొందరు మగ మృగాళ్ల వల్ల ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. అందుకే మహిళలందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మహిళలు ప్రమాదంలో చిక్కుకుంటూ ఉంటారు.

2. అలాంటి సందర్భాల్లో వారు ఏమి చేయాలో తెలియక లేదా ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియక కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ ఉంటారు. తాజాగా ప్రియాంక రెడ్డి అనే డాక్టర్ కూడా ఇలాంటి పొరపాటే చేసింది. అయితే మహిళలు ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే లేదా ఎవరిపై అయినా అనుమానం వంటివి వస్తే ఏయే పనులో చేయాలో తెలుసుకోండి…

అమ్మాయిలు డేంజర్లో ఉన్నారని భావిస్తే వెంటనే ఈ పనులు చేయాలి…

3. టెక్నాలజీని వాడుకోవాలి…

ఈరోజుల్లో ప్రతి ఒక్కరితోనూ స్మార్ట్ ఫోన్ అనేది ఎక్కువగా ఉంటోంది. కాబట్టి మీరు మీ ఫోన్ లో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జిపిఎస్)ను ఆన్ లో ఉంచుకోవాలి. అలాగే ఇంటర్నెట్ ను కూడా ఆన్ లో ఉంచుకోవాలి. అలాగే మీ స్మార్ట్ ఫోన్ లో 112 అనే ఫోన్ నెంబర్ ను సేవ్ చేసి ఉంచుకోవాలి. ఇది ఎమర్జెన్సీ నంబర్. దీనికి ఫోన్ చేసినా మీ ఫోన్ జిపిఎస్ ఆధారంగా లొకేషన్ ను ట్రాక్ చేసి పోలీసులు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది.

4. అలాగే మీ స్మార్ట్ ఫోన్ లో ‘హాక్ ఐ’, ‘షీ సేఫ్’, 112 ఇండియా యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అందులో మీ కుటుంబసభ్యులు, స్నేహితుల నెంబర్లను సేవ్ చేసుకోవాలి. మీకు అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే ఆ సమాచారం అంతా ఆటోమేటిక్ గా పోలీసులకు చేరుతుంది. వారు జిపిఎస్ ఆధారంగా మీ లొకేషన్ ను ట్రాక్ చేసి మీరున్న ప్రదేశానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకొని మిమ్మల్ని వెంటనే రక్షించే ప్రయత్నం చేస్తారు.

ఈ నెంబర్లకు ఫోన్ చేయాలి…

5. మీరు మీ ఫోన్ లో 112 సేవ్ చేసుకున్న అనంతరం మీరు ఆపదలో ఉన్నట్లు అనిపించినా, అగ్ని ప్రమాదాలకు సంబంధించినా లేదా మెడికల్ ఎమర్జెన్సీతో పాటు ఇంకా ఏదైనా సరే వెంటనే 112 నెంబర్ కు ఫోన్ చేయాలి. అలాగే ఆ నెంబరును కూడా మీ హోమ్ స్క్రీన్ లో షార్ట్ కట్ లో ఉంచుకోండి. వీటితో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు 100, 1090, 181, 1091 నెంబర్లకు కాల్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు.

ఫోన్ చేసే పరిస్థితిలో లేకపోతే…

6. మీరు ఎవరికి ఫోన్ చేసే పరిస్థితిలో లేకపోయినా మీరు ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. అది ఎలాగంటే మీ స్మార్ట్ ఫోనులోని పవర్ బటన్ లేదా లాక్ బటన్ ను వెంట వెంటను మూడు సార్లు ప్రెస్ చేసినా కూడా ఎమర్జెన్సీ నెంబర్ కు ఆటోమేటిక్ గా కాల్ వెళ్తుంది. మీరు ఏదో ప్రమాదంలో లేదా ఆపదలో ఉన్నారని పోలీసులకు నిర్ధారణకు వస్తారు. జిపిఎస్ ఆధారంగా మీరున్న ప్రాంతానికి చేరుకుని మిమ్మల్ని రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ లేకపోతే..

7. కొన్ని సందర్భాల్లో లేదా ఒకవేళ మీతో స్మార్ట్ ఫోన్ లేకుండా సాధారణ ఫోన్ ఉంటే మీరు అప్పుడు ఫోన్ చేసే పరిస్థితిలో లేకపోతే మీరు ఇలా చేయాలి. మీ ఫోన్ లో ‘5’ నెంబర్ ను లేదా ‘9’ నెంబర్ గట్టిగా నొక్కాలి. దాని వల్ల కూడా ఆటోమేటిక్ గా మీ కాల్ అనేది పోలీసులకు కనెక్ట్ అవుతుంది. దీని వల్ల కూడా పోలీసులు మీరు ఉన్న ప్రాంతాన్ని ట్రాకింగ్ చేసి మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది.

అవగాహన పెంచుకోవాలి…

8. మహిళలు రాత్రిపూట గాని లేదా బహిరంగ ప్రదేశాల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ వద్ద ఉండే ఫోన్లలో టోల్ ఫ్రీ నెంబర్లు 112, 100, 1090, 181, 1091 పట్ల కనీస అవగాహన అనేది పెంచుకోవాలి. ముఖ్యంగా బాలికలు, యువతులు ఏదైనా ఆపద సంభవించినప్పుడు లేదా ప్రమాదంలో ఉన్నట్లు భావించినపుడు లేదా ఎవరైనా ఆకతాయిల వేధింపునకు గురైనట్లు భావిస్తే వెంటనే పై నెంబర్లకు ఫోన్ చేయాలి. మీరు ఉన్న లొకేషన్ ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకుని మిమ్మల్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది.

Also read : ప్రియాంకారెడ్డిని పక్కా ప్లాన్ తో రేప్.. మినిట్ టూ మినిట్ ఎం జరిగిందంటే?

Sobha sirla

error: