RTC ప్రైవేటు పరం: జనానికి వరమా ..క్షవరమా..?

TSRTC, Telangana, kcr

ఇప్పుడు RTC డ్రైవర్ కి కండక్టర్ కి ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చి అన్నం పెట్టి మరీ ప్రైవేటు వ్యక్తులతో డ్యూటీ చేయిస్తున్నారు.అయితే కండక్టర్లకు డ్రైవర్లకు జీతం రోజుకు 500 కూడా ఉండదు.

ఇక హైద్రాబాద్ లాంటీ నగరాలలో కొందరి కొత్త డ్రైవర్ ల రాష్ డ్రైవింగ్ వలన పోలీసులు ఫైన్లు రాస్తున్నారు. అయితే ఈ ఫైన్లన్నీ వ్యక్తి ఖాతాలో కాక బస్ ఖాతాలో పడతాయి. అంటే RTC ఖాతాలో పడతాయి. అదేవిధంగా బస్ ల మైలేజీ కూడా విపరీతంగా పడిపోయింది. టైర్ల లైఫ్ టైం కూడా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తులకు రోజుకిచ్చే వెయ్యి రూపాయలు డీజిల్ ఖర్చులు బస్ మెయిన్ టెనెన్స్ లు అన్నీ కలిపి రేపు ఛార్జీల పెంపు రూపంలో ప్రజల నుండే వసూలు చేస్తారు.

ఇంతకుముందు ఎవరికి కోపం వచ్చినా ఏ రాజకీయ పార్టీకి తాపం వచ్చినా ముందు బస్సు అద్దాలే పగిలేవి. ఆ ఖర్చంతా తడిసి మోపెడై RTC ని మూసివేసి స్దితికి వచ్చింది. అదానే రాజకీయ పార్టీల మీటింగ్ లకైతే బస్సులు చాలా తక్కువ ధరకు ఇవ్వాలి. ఈ బస్సులను అద్దెకిచ్చే అధికారం డిపో మేనేజర్ చేతిలో ఉండడం వలన రాజకీయ పార్టీలతో అంటకాగేందుకు ఆయన తన లొసుగులను కప్పి పుచ్చుకునేందుకు.. RTC యూనియన్ నాయకులు కూడా గొప్ప కోసం తక్కువ రేటుకీ బస్ లను అద్దెకిచ్చినా చూసీ చూడనట్లు గా ఉండేది.వీరి ఇలా చూసీ చూడకుండా ఉండేందుకు RTC నాయకులకు డ్యూటీలు కేటాయించకుండా డిపో మేనేజర్లు ఊరికే జీతాలిచ్చేవారు.

Also read : ఆత్మహత్యలు, హార్ట్ఎటాక్ లతో ప్రభుత్వానికి ఏం సంబంధం?

ఇప్పుఢు ఈ ఖర్చంతా ఎవరి మీద పడుతుంది..!!ప్రజల మీదనే కదా..!!రేపు ఛార్జీల పెరిగాయని ప్రజలు గొడవచేసినా ఈనాడు RTC వారిని విధుల్లోకి తీసుకోను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎలా అయితే అంటున్నారో రేపు ప్రజలను కూడా పెంచిన ఛార్జీలను కామ్ గా భరించండీ. ధర్నా చేస్తే రెట్టింపు పెంచుతా లేదా బస్సులను రద్దు చేస్తా అంటే కార్లున్న వారు బైకులున్న వారంటే వారి స్వంత వాహనాలలో వెళతారు మరి పేద ప్రజలు ఎలా వెళ్ళాలి..!

ఆటోల్లోనో ప్రవేటు బస్సుల్లోనో వేరే వాహనాల్లోనో వెళ్ళాలి.. ప్రైవేటు వారు చార్జీలు డబుల్ ట్రిపుల్ అడిగితే ఏం చేస్తారు.వారు ఎవరితో పోల్చుకుని తమ ఛార్జీలను నిర్ణయిస్తారు. పోల్చుకోవడానికి ఒక వ్యవస్థుంటేనే కదా..!! అందుకే RTC ని కాపాడుకోకపోతే దాన్ని మూసేస్తారు ఉద్యోగులకు పోయేది ఏమీ ఉండదు.వారికి వచ్చే గ్రాట్యుటీ, ఫించను ఖచ్చితంగా వస్తాయి.కాని ఆంధ్ర తెలంగాణ పేద ప్రజల బ్రతుకులు మాత్రం ఘొరాతిఘోరంగా ఉండబోతున్నాయి.

RTC ప్రైవేటు పరం అయ్యాక అప్పుడు జనానికి నొప్పి తెలుస్తుంది .. ఆ నొప్పి మర్చిపోయేందుకు ఏదో ఒక డబ్బులిచ్చే ఫథకం ప్రవేశపెట్టగానే ఇదే జనం ఆహా ఉచితంగా డబ్భులిచ్చారని సంకలు గుద్దుకుంటూ పుండు మీద కారం చల్లుకుని దాన్నే గిల్లుకుంటూ హాయిగా ఉందంటూ ఆనందిస్తారు..

krishna korivi