RTC ని కాపాడకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి  ఆలోచించండి..!!

RTC,Telangana,kcr,jathara.com,Telangana news

జనాలు RTC ని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తేనే.. సర్వీస్ మెరుగుపడుతుంది..RTC డ్రైవర్ల కండక్టర్ల పొగరు అణుగుతుందని సంబర పడుతున్నారు.

అయితే ప్రతిరోజూ RTC బస్సుల్లో ప్రయాణించే వారికి RTC లేనీ లోటు ఖచ్ఛితంగా తెలుస్తుంది. ఈనాడు ఏ ప్రైవేటు ఆపరేటర్లైనా తమ ఛార్జీలను RTC తో పోల్చుకునే.. దానికంటే కొంచెం ఎక్కువ ధరతో మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. అయితే ఏరోజైనా ఎవరైనా RTC బస్ ని ఆపితే ఆపకపోతే ఆ బస్ ని ఛేజ్ చేసి మరీ ఆ డ్రైవర్లతో గొడవపడిన సంధర్భాలు కోకొల్లలు. బస్ ఆపకుండా వెళ్ళారని ఆర్టీసి డిపోల్లో వారి మీద ప్రతిరోజూ వందల సంఖ్యలో కంప్లైంట్ లు కూడా ఉంటాయి. దీని కారణం ఏంటి..!!

RTC మనది మనందరిది..!! దాని మీద హక్కు మన రాష్ట్రానిది. దేశ ప్రజలది.అసలు ఆర్టీసీ కార్మికులు బస్ ఆపకుండా వెళ్ళినా ఎక్కువ రేట్ వసూలు చేసినా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా మన మిస్ బిహేవియర్ వల్లనే దిగిపొమ్మన్నా ఈ బస్ మాది మేమెందుకు దిగాలి అంటూ అతని మీదకే గొడవకి వెళతాం. ఇక రోడ్ మీద చెయ్యెత్తిన ప్రతివాడి దగ్గరా బస్ ఆపుతూ ఎందుకు వెళ్తున్నావని కొందరు.. ఎందుకా పట్లేవంటూ మరి కొందరు.. నెమ్మదిగా పోతున్నావేంటని ఇంకొందరు ఇలా ప్రతి వారు ఎవరికి తోచినంతలో వారు ప్రతినిత్యం డ్రైవర్ కండక్టర్లతో గొడవపడుతూనే ఉంటారు.దీనికి కారణం అది మన సంస్థ అనే ధైర్యం నమ్మకం వల్లనే కదా.. !

RTC ని ప్రైవేటుపరం చేస్తే ప్రైవేటు వాహనాలు రోడ్ల మీద తిరుగుతుంటాయి ఇక ఆ ప్రైవేటు బస్సుల్లో ఆటోల్లో కార్లల్లో ప్రయాణిస్తున్నప్పుడు RTC బస్ లో కూర్చున్నంత ధైర్యంగా రిలాక్స్డ్ గా మన అనే ఫీల్ తో కూర్చోగలమా..!కనీసం మనం ఏదైనా సర్వీస్ ని డిమాండ్ చేయగలమా..!!

మనం ప్రైవేటు వెహికల్ వ్యక్తితో గొడవపడితే వెంటనే దిగిపొమ్మంటాడు.నేనెందుకు దిగాలి అని గొడవ చేయగలమా.. యాభై మంది మాత్రమే ఉండాల్సిన బస్ లో 200మందిని ఎక్కించుకుంటే కనీసం నోరు మెదపగలమా..!! ఏమన్నా అంటే ఉంటే ఉండండి లేకుంటే దిగిపోండని డబ్భులు మొఖం మీద కొడతారు. అలానే ఛార్జీలు కూడా ఇష్టమున్నట్లు వసూలు చేస్తారు..ఇష్టమైతే ఎక్కండి లేకుంటే లేదు అంటే సామన్య పౌరులు ఎటు వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి. ధరలను ఎవరితో పోల్చుకుని వసూలు చేస్తారు. ధరలకు అడ్డూ అదుపూ ఉంటుందా అసలు..!!

ప్రభుత్వం ఉచితంగా చేయాల్సిన రెవెన్యూ సర్వీసులన్నీ “మీ సేవ” పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. అక్కడ ప్రభుత్వమే ప్రతీ పనికి కొంత ఫీజును నిర్ణయించింది. కాని అక్కడి ఆపరేటర్లు ప్రతీ సర్వీస్ కు ప్రభుత్వం నిర్థేశించిన ఫీజునే కాకుండా యాభై నుండి రెండు వందల రూపాయల వరకు అధనంగా తీసుకుంటున్నారు. మీ సేవ ఏర్పాటు చేసిన కొత్తలో నిర్థేశించిన ఫీజు మా అకౌంట్లో నుండి కట్ అయిపోతుంది ఇదంతా గవర్నమెంట్ కే చెందుతుంది. అని మాయ మాటలు చెప్పి అదనంగా ఇంకో యాభై రూపాయలు తీసుకునే వారు.

నిజానికి మీ సేవ వారికి 20%నుండి 30% ఫీజు తర్వాత క్రెడిట్ అవుతుంది. అయితే ఇప్పుడు మాత్రం సర్వీస్ ని బట్టి అసలు ఫీజు కి ఒక యూభై నుండి రెండువందల రూపాయలు కలుపుకుని వసూలు చేస్తున్నారు. ఇదేంటని నిలదీస్తే నీ ఇష్టమైతేనే చేయించుకో అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు.అయితే ఈ మీసేవ వారంతా యూనియన్ అవ్వఢంతో ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇప్పుడు దీన్ని బట్టి RTC ప్రైవేట్ పరం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేశినేని ,కల్లాడ, జేసి బ్రదర్స్,ఆరెంజ్ ట్రావెల్స్ లో ఎప్పుఢో ఒకసారి ప్రయాణించేవారి గురించి నేనేమి మాట్లాడను కాని పొట్టకూటికి, ఉపాధికి ,విద్య కొరకు ప్రతిరోజూ ప్రయాణించే సామాన్యుల పరిస్థితి ఏంటి..!!

అలానే ఈ రవాణా రంగం మీద ఆధారపడిన నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉండబోతున్నాయో తలచుకుంటేనే భయంకరమైన భవిష్యత్తు కనపడబోతుంది…!! అలానే దూరప్రాంత నుండి చదువుకోవడానికి నగరాలకు వచ్చే పేద విద్యార్థులకు బస్ పాస్ లు ఉంటాయా అసలు.. ఉన్నా ప్రైవేటు వారు ఎక్కించుకుంటారా..!!దూరప్రాంత విద్యార్థుల చదువు అటకెక్కాల్సిందేనా.. RTC ని కాపాడకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి..!!

Also read : మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి

ఉద్యోగుల సమ్మెలో న్యాయం ఉన్నా లేకున్నా RTC ని ప్రైవేటు పరంకాకుండా అడ్డుకోకుంటే 1990కి ముందున్న టెంపోల సంస్కృతి ,జీపుల సంస్కృతి , బస్ సర్వీసుల సంస్కృతి వస్తుంది. అదెంత భయానకమో పల్లెటూర్లకి ఇప్పుటికీ ఆటోల్లో వెళ్ళే వారిని అడిగితే తెలుస్తుంది.

నేను ఇంత వరకు TSRTC ,APSRTC వారు బస్ ఆపకుండా వెళ్ళారని,ఎక్కించుకోలేదని తిట్టిపోసాను కాని ప్రైవేటు కార్,బస్ ,ఆటోవారు ఆపకుండా వెళ్ళారని కాని నాతో దురుసుగా మాట్లాడారని కాని ఒక్కసారి కూడా అనలేదు. ధానికి కారణం వారు చాలా గౌరవంగా తీసుకెళ్ళారని కాదు.అంతకంటే దారుణంగానే అవమానించారు. కాని RTC నాది మనది అన్న అభిప్రాయం వల్లనే RTC మీద ఒక తల్లిమీద కొట్లాడినట్లు ..తండ్రి మీద అలిగినట్లు.. గా గొడవపడ్డాను…..

RTC మీద మనందరికి హక్కు ఉంటుంది. ఆ హక్కుని పోగొట్టుకుంటే చరిత్రలో తెలంగాణ ప్రజలు పేద ప్రజల వేడి కన్నీళ్ళతో తగలబెట్టబడతాం..

Krishna korivi

error: