అప్పుడు హీరో వెంకీని కొట్టిన బామ్మ ఇప్పుడు లేరు.. | jathara.com

అప్పుడు హీరో వెంకీని కొట్టిన బామ్మ ఇప్పుడు లేరు..

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో హీరో వెంకీ,  త్రిష ఇంటికి వచ్చి అక్కడ ఓ ఉయాలలో కూర్చుంటే వెంకీని ఓ బామ్మ కొడుతూ…‘‘అయ్యో, అయ్యో అప్రాచ్యుడా ఎవడ్రా నువ్వు అడ్డగాడిద.. ఎంత ధైర్యంరా నీకు, నీ కులం ఏంట్రా, నీ జాతి ఏంట్రా, పిశాచి పీనుగ.. ఒరేయ్, ఒరేయ్ పసుపు నీళ్లు పట్టుకురండిరా, సర్వనాశనం అయిపోయింది కదరా, అంతా అపవిత్రం అయిపోయింది, దేవుడా నేను ఏం చేయను’’ అంటుంది. కదా ! ఆ బామ్మ ఇక లేరు..

Read also :  టాలీవుడ్ లో మరో విషాదం.. గొల్లపూడి ఇక లేరు

ఆమె పేరు కిషోరి బళ్ళాల్… కన్నడలో మంచి నటి. ప్రస్తుతం ఆమె వయసు 82 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగానే ఆమె నిన్న మృతిచెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. కిశోరి హిందీలో షారుఖ్ ఖాన్ సినిమా ‘స్వదేశ్’లో కిషోరి బళ్ళాల్ చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది…అంతేకాకుండా పలు సీరియల్స్ లో ఆమె నటించారు. ఆమె మరణం పట్ల కన్నడ ఇండస్ట్రీతో పాటు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Also Read :  గుడి ముందు భిక్షాటన.. తిరిగి అదే గుడికి విరాళం!

Read also :  తన్నుకున్న అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి.. ఎందుకో తెలిస్తే నవ్వడం ఖాయం..