రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కేసీఆర్, జగన్

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రైతు బాగుంటూనే రాష్ట్రం బాగుంటుందని రైతూ రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవమే ఈ సంక్రాంతి పండుగ అని అన్నారు..

రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ” ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరిసేలా ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విలసిల్లెలా భగవంతుడు దీవించాలని ప్రార్ధిస్తూ.. రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు”

Hon'ble CM Sri K. Chandrashekar Rao conveyed the auspicious Makara Sankranti greetings to people of Telangana. CM prayed…

Posted by Telangana CMO on Tuesday, January 14, 2020

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొంది… నగరవాసులు పల్లెలకి చేరుకొని సంక్రాంతి పండుగని కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటున్నారు.

error: write your own !