Politics

మా దగ్గర ఒక్క కరోనా కేసు లేదు.. లాక్ డౌన్ ఎత్తేస్తాం..

Meghalaya

Meghalaya

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,421 మందికి కరోనా వైరస్‌ సోకగా, 114 మంది మరణించారు.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ని మరిన్ని రోజులపాటు పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. కేంద్రం కూడా ఇదే దిశగా అడుగులు వేసే ప్రయత్నం ఉన్నట్టుగా తెలుస్తోందని అంటున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైనా మేఘాలయ మాత్రం…మా దగ్గర కరోనా కేసులు లేవు లాక్‌ డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఏప్రిల్ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని మేఘాలయ సర్కార్ ప్రకటించింది. పాఠశాలలను మాత్రం ఏప్రిల్ 30వ తేదీ వరకు మూసి ఉంచుతామని తెలిపింది. ఆరోగ్య శాఖ చేసిన సూచనలను అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లు తెరవడానికి, రైతులు పొలాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రవేటు సంస్థలు మాత్రం మరికొంత కాలం మూసే ఉంటాయని తెలిపింది.

Also Read : కేసీఆర్ చెప్తుండు.. శిక్ష ఖతర్నాక్ ఉంటది : ప్రెస్ మీట్ హైలైట్స్

Comments are Closed

Theme by Anders Norén