మన సదువులు గిట్ల అయితే ఎట్లా?

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రతిభపాటవాల పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో తనిఖీలు నిర్వహించిన మంత్రి మధ్యాహ్న భోజన వసతి గురించి పరిశీలించారు.

అదేవిధంగా అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల క్లాస్ రూమ్ లోకి వెళ్లి అక్కడ విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్టుల గురించి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. కనీసం వారి పేర్లని వివిధ భాషలలో (తెలుగు, హిందీ, ఇంగ్లీష్) లలో కూడా రాయలేకపోయారు.

Advertisement

ఇక ఎక్కాల విషయంలో పదవ ఎక్కం వరకే చెప్పగలిగారు. దీనితో మంత్రి ఉపాధ్యాయుల బోధన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎట్లా అని ఉపాధ్యాయులని ప్రశ్నించారు. ఇలాంటి చదువులతో ఎలా పదవ తరగతి పాస్ అవుతారని ప్రశ్నించారు. టీచర్లు విద్యార్థులను ఒకటో తరగతి నుంచే క్రమశిక్షణలో పెట్టాలని లేకపోతే ఇలా సుద్దమొద్దులు అవుతారని తెలిపారు.