Off Beat, Trending

గంభీర్.. హాట్స్ ఆఫ్ ..నీకు సెల్యూట్ చేయాల్సిందే.. ! చేతులెత్తి మొక్కాల్సిందే !

Mp gautam gambhir performs last rites of domestic help amid lockdown

Mp gautam gambhir performs last rites of domestic help amid lockdown

గౌతమ్ గంభీర్.. మనిషిలో ఆవేశం ఎక్కువే.. మంచితనం, మానవత్వం అంతకన్నా ఎక్కువే.. ఏదైనా జరిగితే చేతులు ముడ్చుకొని కూర్చొడు.. చేతనైంది చేయడానికి ముందుకు వస్తాడు.. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ ఆయన విషయమే.. తాజాగా గంభీర్ చేసిన పని అతనిపై గౌరవాన్ని పదింతలు పెంచింది. ఇంతకీ ఏంటి ఆ సంగతి అంటే.. గంభీర్ ఇంట్లో ఒరిస్సాకి చెందిన సరస్వతి పాత్రా అనే 49 ఏళ్ల మహిళ గత ఆరేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తుంది. నమ్మకంగా పనిచేసింది. కానీ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైంది.

చికిత్స పొందుతూ ఈ నెల 21 న చనిపోయింది. ఇంట్లో పనిచేసే పనిమనిషి చనిపోయింది. లాక్ డౌన్ వల్ల కుటుంబ సభ్యులకు శవాన్ని ఇవ్వలేని పరిస్థితి.. గంభీర్ ఎంపీ, అది పక్కన పెడితే మంచి రిచ్ మ్యాన్.. డబ్బులు పెట్టి ఆమె మృతదేహానికి మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే ఆ తరవాత జరగాల్సిన తతంగం అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ అక్కడ గంభీర్ అలా ఆలోచించలేదు.. అమెనో పనిమనిషి లాగా చూడలేదు.. ఇంట్లో మనిషి లాగే ట్రీట్ చేశాడు. ఓ అక్కో, అమ్మో అనుకున్నాడు. మానవత్వంతో ముందుకు వచ్చి తానే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు.

https://twitter.com/GautamGambhir/status/1253320149043515392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1253320149043515392&ref_url=https%3A%2F%2Fthelogicalindian.com%2Fnews%2Fgautam-gambhir-last-rites-domestic-help-covid-19-death-20768

అంత్యక్రియలు ఓ బాధ్యత గా నిర్వహించాడు. కులమతాలకి అతీతంగా వ్యవహరించడమే హుందాతనం అనుకున్నాడు.. అదే నమ్మాడు.. అందుకే ఆమె అంత్యక్రియలను పూర్తి చేశాడు.. మానవత్వం మనిషిలో ఏ మాత్రం ఉన్న నువ్వు చేసిన ఈ పనికి సెల్యూట్ చేయాల్సిందే.. ! చేతులెత్తి మొక్కాల్సిందే.. ! ఇంట్లో పనిమనిషి చనిపోయిందంటే అంతో ఇంతో డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నీలా ఆలోచించే మనుషులు మన సమాజంలో తక్కువే గంభీర్. అందుకే నీకు హాట్స్ ఆఫ్..

Read More : మరక మంచిదే.. కరోనా మంచిదే!

Comments are Closed

Theme by Anders Norén