నితిన్ పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఈమె! | jathara.com

నితిన్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఈమె!

యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. కానీ ఆ అమ్మాయి ఎవరన్నది మాత్రం ఎవరికీ తెలియదు.. కానీ తాజాగా నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో కనిపించే అమ్మాయిని నితిన్ ఏప్రిల్ 16 దుబాయ్ లో పలాజో వర్సాచీ హోటల్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది..

Read also :  fight Corona out break : టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు

నితిన్ కి షాలినికి మధ్య పరిచయం 2012 లో జరిగిందట.. ఆ తరువాత ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట ఈ క్రమంలో నితిన్ షాలిని కి ప్రపోజ్ చేశారట ఆమె కూడా దీనికి ఒప్పుకున్నారట.. ఇదే విషయం ఇంట్లో చెప్పగా ఒప్పుకున్నారట. ఇక శనివారం హైదరాబాద్‌లో ఉన్న నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు.

దుబాయ్ లో పెళ్లి అనంతరం హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ చేయనున్నారు. దీనికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

Read also :  బాలీవుడ్ లోకి రౌడీ ఎంట్రీ .. పూరితో కొత్త సినిమా షూరు

Also Read : రాత్రికి రాత్రే కూలీ కాస్తా కోటీశ్వరుడు అయ్యాడు!