Biggboss : పేరు ఘనం… ఫలితం శూన్యం

bigg boss contestants

బిగ్ బాస్ అతి పెద్ద రియాలిటీ షో.. నార్త్ నుండి వచ్చి సౌత్ లో పాతుకుపోయిన షో… మన తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలియని షోనే అయినప్పటికీ బాగానే ఆదరించారు ప్రేక్షకులు.. ఈ షో మొదటి సీజన్ చేస్తున్నప్పుడు అందరిని ఆకట్టుకునేందుకు అంతో ఇంతో తెలిసిన యాక్టర్స్ ని ఎంపీక చేసి తీసుకువచ్చారు షో నిర్వాహకులు ..

అప్పటికి కొంచెం కొంచెం పేరు ఉండడం,ఈ షో ద్వారా మరింత మందికి ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉండడంతో చాలా మంది బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. వంద రోజులు ఉండేందుకు ఒప్పుకున్నారు. బాండ్ కూడా ఇచ్చేసారు.. షోలో పాల్గొన్నారు . కానీ వచ్చే పేరు ఏమో కానీ ఉన్న పేరు అవకాశాలు కూడా పోయాయి..

శివబాలాజీ ఎక్కడున్నాడో… ?

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్‌బాస్‌ సీజన్ వన్ కి విజేతగా నిలిచాడు హీరో శివబాలాజీ .. విజేతగా రూ.50 లక్షల ప్రైజ్‌మనీ కూడా గెలుచుకున్నాడు. పేరు కూడా బాగానే వచ్చింది. కానీ సినిమా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదు. అంతకుముందు అడపాదడపా సినిమాల్లో నటించిన శివబాలాజీ ఆ తర్వాత సినిమాల్లో కనిపించడమే మానేశాడు. ఇక ఆ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ల పరిస్థితి అయితే మరి దారుణంగా తయారైంది.. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు పత్తాకు లేకుండా పోయారు.

కౌశల్ ఉన్నావా ?

ఇక రెండో సీజన్‌లో కౌశల్‌ విజేతగా నిలిచాడు. ఇక్కడ మాత్రం వార్ వన్ సైడ్ గా నడిచిపోయింది. కౌశల్ ని విన్నర్ ని చేయడానికి గ్రూపులు, అర్మీలుగా తయారయ్యారు.అతని కోసం ఏకంగా రోడ్డెక్కారు. కౌశల్‌ను బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రకటించాలంటూ ఆర్మీల పేరిట ర్యాలీలు చేస్తూ నానా హంగామా చేసారు.
దీనితో కౌశల్ పేరు మారు మొగిపోయింది. కౌశల్ ఓ మామలు ఆర్టిస్ట్ నుండి హీరో అయిపోయాడు. ఏకంగా సినిమాలు చేస్తాడని టాక్ కూడా వచ్చింది. కట్ చేస్తే సినిమాలు కాదు కదా.. అప్పట్లో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించలేదు. దీనితో అందరికి బిగ్ బాస్ పేరు ఘనం ఫలితం శూన్యం అనే నమ్మకం ఏర్పడింది.

ఇప్పుడేంటి ?

ఇప్పడు కూడా అదే రిపీట్ అవుతుందా అని అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సీజన్ కి విజేతగా రాహుల్ నిలిచాడు. రాహుల్ ప్రస్తుతం ఓ ప్రొఫెషనల్ సింగర్ గా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అనేది అందరిని వెంటాడుతున్న ప్రశ్న..

Also Read: Biggboss3 కి రియల్ హీరో బాబా భాస్కర్… !

error: write your own !