Cinema

శభాష్ ప్రణీత… నీ ముందు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు కూడా వేస్టే!

Pranitha Subhash

Pranitha Subhash

ప్రణీత సుభాష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కన్నడ నటి… పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో సమంత అక్కగా నటించింది. ఇదే కాక చిన్న చితక కలిపి ఓ పది సినిమాలో నటించింది. చిన్న హీరోయినే కావచ్చు కానీ మా నవత్వంలో మాత్రం మెగాస్టార్లు, సూపర్ స్టార్లు కూడా వేస్టే అనేలా వ్యవహరిస్తోంది. కరోనా వలన ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల కోసం టాలీవుడ్లో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా… హ.. అందులో మొదటగా ముందుకు వచ్చి లక్ష రూపాయల విరాళం ఇచ్చి మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ గా నిలిచింది..

ఇంకేంటి విరాళం ఇచ్చామ్ కదా! అని చేతులు దులుపుకోలేదు.. లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి తానే స్వయంగా అన్నం వడ్డించి ఇలా పార్శిల్స్ రూపంలలో పంపిణీ చేస్తుందట.. ఇలా ఇప్పటివరకు నిరుపేదలకోసం 21రోజుల పాటు తన స్వంత ఖర్చులతో 75,000 భోజన ప్యాకెట్లు పంచిందట.. ఇది అసలైన సాయం, ఛాలెంజ్ కూడా… అభినందించాల్సిన వార్త అంటే ఇది.. ‘బి ది రియల్ మ్యాన్’ అంటూ మన దగ్గర ఓ దిక్కుమాలిన ఛాలెంజ్ అంటూ కొట్టుకు చస్తున్నరు.. కానీ ఇలా చేయాలని మాత్రం ఒక్కరికి కూడా సోయి లేదు.. పోనీ అలా చేస్తున్నారు అంటే దానివల్ల ఓ ఉపయోగం ఉందా.. అది లేదు.. ఏది ఏమైనా ప్రణీత చేస్తున్న ఈ సహాయానికి మనం హాట్స్ ఆఫ్ అనాల్సిందే..!

Also Read : కలికాలంలో దానకర్ణులు.. పేదల ఆకలి తీర్చడానికి జాగ అమ్మిర్రు!

Comments are Closed

Theme by Anders Norén