Cinema, Trending

రజినీకాంత్ క్రేజ్ ముందు బోసిపోయిన అతని విరాళం.!

ఆసియా ఖండంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద దేశం ఇండియా.. కరోనా వైరస్ విషయంలో భారత్ కూడా అలుపెరగని మృత్యు పోరాటం చేస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా రక్కసిని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలంతా దాదాపుగా ఇళ్లకే పరిమితమై కరోనా వైరస్ నివారణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

భారత్ లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సినీ పరిశ్రమ చేయూత అందించడం మరువలేనిది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్, శాండల్ వుడ్ మొదలగు ప్రాంతీయ సినీ పరిశ్రమలు ప్రజలకు, ప్రభుత్వాలకు తమవంతు విరాళాలు ప్రకటిస్తూ సహాయ సహకారాలను అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. భారీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించి మరొకసారి తన ఔదర్యాన్ని చాటి మిగతా సినీ ప్రముఖులకు ఆదర్శవంతంగా నిలిచారు.

Also Read : Paracetamol Tablet : కేసీఆర్, జగన్ పై పేలుతున్న జోకులు

ఇక బాలీవుడ్ తరువాత ఎంతో సినీ చరిత్ర ఉన్న పరిశ్రమ కోలీవుడ్ ముఖ్యంగా రజినీకాంత్ ని తీసుకుంటే దక్షిణ ఉత్తర భారతదేశంలోనే కాకుండా చైనా, జపాన్, మంగోలియా, మలేషియా, సింగపూర్ లో రజనీ అభిమానులు ఉన్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. ఆ మధ్య కాలంలో విడుదలైన శివాజీ, రోబో సినిమాలకు గాను రజినీకాంత్ భారతదేశంలో లో ఏ స్టార్ హీరో తీసుకొని రెమ్యూనరేషన్ తీసుకొని, నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకెళుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆసియా ఖండంలో జాకీచాన్ తర్వాత అంతటి క్రేజ్ వున్న స్టార్ రజనీకాంత్. కానీ కరోనా రక్కసి ఊబిలో అతలాకుతలం అవుతున్న ప్రజలకు కేవలం 50 లక్షల మొత్తం ప్రకటించిన రజినీకాంత్ ను చూసి ఆ విరాళం అతనినే వెక్కిరిస్తుందా !

Comments are Closed

Theme by Anders Norén