హరీష్ రావు 41, కేటీఆర్ 17, కేసీఆర్ 13 ర్యాంకులు కాదు కేసులు... | jathara.com

హరీష్ రావు 41, కేటీఆర్ 17, కేసీఆర్ 13 ర్యాంకులు కాదు కేసులు…

ఎమ్మెల్యే , ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్న జాబితాను తమ అధికార పార్టీ వెబ్సైట్ లో ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.. ఇందుకోసం పార్టీలకు 48 గంటల సమయం ఇచ్చింది. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ధర్మాసనం 72 గంటలు గడువు ఇచ్చింది.

అందులో భాగంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులుపై ఉన్న కేసుల వివరాల జాబితా సిద్ధమైంది.. కాంగ్రెస్‌లో 19, టీఆర్ఎస్‌లో 69 మంది, టీటీడీపీలో ఇద్దరు, ఎంఐఎంలో ఏడుగురు, బీజేపీలో నలుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్ రావుపై అత్యధికంగా 41 కేసులు నమోదయ్యాయి. తర్వాత మంత్రి కేటీఆర్‌పై 17, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 13 తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నాయి. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 17 క్రిమినల్ కేసులు రౌడీ షీట్ ఉంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై 8, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై 9 కేసులు ఉన్నాయి.

Read also :  తల్లికి బిడ్డలు బరువా..! ప్రభుత్వానికి కార్మికులు బరువా..!

కాంగ్రెస్ లీడర్లు అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై 4, చిరుమర్తి లింగయ్యపై 8, దానం నాగేందర్‌పై 4 కేసులు ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు సహా మరో 7 కేసులు నమోదై ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ లీడర్లు అయిన ఆత్రం సక్కుపై 13, రోహిత్ రెడ్డిపై 8, తాటికొండ రాజయ్యపై 5 కేసులు, ఎర్రబెల్లిపై 5, గంగుల కమలాకర్‌పై 3, మంత్రులు సబితా ఇంద్రారెడ్డిపై 4 కేసులు, తలసానిపై 3, మాజీ మంత్రి జూపల్లిపై 3 కేసులు ఉన్నాయి…

Read also :  జేడీ రాజీనామా... పవన్ కి టీడీపీ నేత సపోర్ట్