తమన్నాకి ధీటుగా స్టెప్పులేసిన మహేష్

అగ్ర కథానాయకుడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ చేస్తుందని సినిమా మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయాన్ని తమన్నా పుట్టినోజు సందర్భంగా చిత్ర యూనిట్ తెలియజేసింది. తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేసింది. ‘డేంగ్.. డేంగ్’ అంటూ పార్టీ సాంగ్ తో ఈ లిరిక్స్ సాగుతాయి. ఈ పాటకి ఎప్పట్లాగే తమన్నా తనదైన స్టైల్లో స్టెప్పులేసింది. తమన్నాకు తోడుగా మహేష్ బాబు కూడా అదరగొట్టాడు. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. నిన్న రాత్రి 7 గంటలకు రిలీజ్ అయిన ఈ ప్రోమో సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులును జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకర లతో కలిసి మహేష్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

రాజేంద్రప్రసాద్, విజయశాంతి, సంగీత, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాని సంక్రాంతి పండుగకి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Also Read : మన సదువులు గిట్ల అయితే ఎట్లా?