Politics

కేసీఆర్ చెప్తుండు.. శిక్ష ఖతర్నాక్ ఉంటది : ప్రెస్ మీట్ హైలైట్స్

KCR

KCR

★ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ అమలుపై నిన్న ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

★ తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 45 మందిని డిశ్చార్జ్ చేశాం .11 మంది చనిపోయారు . ప్రస్తుతం 308 మంది బాధితులు సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

★ కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదు. విదేశాల నుంచి వచ్చింది. 25937 మందిని క్వారయింటైన్ చేశాం. అందులో 50 కి మాత్రమే పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకింది. మర్కజ్ నుంచి వచ్చిన 1089 మంది అనుమానితుల్లో 172 మందికి పాజిటివ్ వచ్చింది.ఆ 172 మంది మరో 93 మందికి అంటించారు.

★ జనతా కర్ఫ్యూ తర్వాత లాక్ డౌన్ పాటిస్తున్నాం. 22 దేశాలు కంప్లీట్ లాక్ డౌన్ చేశాయి. జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలి. లాక్ డౌన్ తప్ప వేరే మార్గం కనిపించడం లేదు . ప్రధానితో రోజుకి రెండు సార్లు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లాక్ డౌన్ కొనసాగించేయాల్సిందేనని నేను ప్రధానికి చెప్పాను. మానవ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం ఇది .. లాక్ డౌన్ కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారు

★ రోగులు అత్యంత దయనీయంగా చనిపోతున్నారు. శరీరంలో తక్కువ వైరస్ సోకిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి ప్రబలడం ప్రారంభం అయ్యాక కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయంగా వచ్చిన సూచనలు సలహాలు పాటించారు. ఈ జబ్బు మన దగ్గర పుట్టింది కాదు కాబట్టి వెనుక ముందు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ పాటించింది. దీనితో మన దేశం చాలా గొప్పగా ఉంది. మన దేశం చాలా సేఫ్ గా చెప్పడం జరుగుతుంది, అంతర్జాతీయ జండ్రల్స్ చెప్తున్నాయి. వివిధ పార్టీలు ఉన్నప్పటికీ చాలా గొప్పగా ఐక్యత పాటిస్తున్నాం అని చెప్పారు

★ అమెరికా లాంటి ధనిక దేశంలో శవాల గుట్టలు గుట్టలగా పెరుకోపోతున్నాయి ట్రక్ లలో శవాలు పంపిస్తున్నారు. శవాల దిక్కు లేదు,అన్నింటిలో ముందు ఉన్న దేశం అమెరికా ఇంత దారుణంగా ఉన్నారు. మన దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు వాళ్ళ ద్వారా ఇతరులకు సోకిన వారు 25937 మందిని క్వారయింటైన్ చేశాం

★ ఇందులో 50 మందికి కరోన పాజిటివ్ వచ్చింది. వాళ్ళ నుండి వారి కుటుంబ సభ్యులకు సోకించారు. ఇందులో ఒక్కరు కూడా చనిపోలేదు. 35 మంది వ్యాధి నుండి కొలుకున్నారు. ఎవరు కూడా సీరియస్ గా లేరు. క్వారయింటైన్ లో ఉన్న వారు రేపటికి అందరూ అయిపోతారు. అందులో ఉన్నవారికి డిశ్చార్జ్ చేస్తాం 9వ తేదీ వరకు పాతవారు వెళ్ళిపోతారు.

★ మధ్యలో వచ్చిన నిజముద్దీన్ కేసులు దేశం మొత్తం కూడా అతలాకుతలం చేశారు. మొత్తం 364 మందికి సోకింది. ఇండోనేషియా వాళ్ళు కూడా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది చనిపోయారు. గాంధీ లో 308 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. నిజముద్దీన్ 1089 మందిని పెట్టుకున్నాం. 30 నుండి 35 మంది ఢిల్లీలో ఉంటారు వారికి అక్కడే ట్రీట్మెంట్ చేసి ఉంటారు. ఇందులో 170 మందికి వైరస్ వచ్చింది చనిపోయిన వారు కూడా ఇందులో వారే. 170 మంది ద్వారా 90 మందికి వచ్చింది అందరిని కూడా పట్టుకున్నారు. సుమారు 3015 మందిని పట్టుకున్నారు. అందరూ కూడా ఒకే మతం వారు లేరు హిందువులు కూడా ఉన్నారు.308 హాస్పిటల్ లలో ఉన్నారు.1000 కిపైగా జబ్బు లేదు

★ ఇంకా కొంత మందికి టెస్ట్ లు జరుగుతున్నాయి .వచ్చే రెండు,మూడు రోజుల్లో అన్ని పరీక్షలు వస్తాయి. వీళ్ల ద్వారా ఎవరికి అయిన సోకిందా అని వేట కొనసాగుతుంది. ఇంటలిజెన్స్ చాలా కష్టపడ్డారు. వారికి అభినందనలు. 308 మంది కాకుండా ఇంకో 110 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు ఆగిపోతుంది అని దేవుణ్ణి కోరుతున్నాను.

★ లాక్ డౌన్ ను ప్రజలు చాలా సహకారాన్ని అందించారు ఇంకా సహకారం ఇవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు లాక్ డౌన్ చేశాయి. మిగతా 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ చేశాయి. సమస్య ఎంత తీవ్రంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

★ మన రాష్ట్రం మన రాష్ట్రంతో పాటు దేశం చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాం . న్యూయార్క్ లో శవాల గుట్టలు ,చూడలేకపోతున్నాం. అప్పట్లో యుద్ధం జరుగుతే ఇలా ఉండేది. అంత శక్తివంతమైన దేశంలో ప్రెసిడెంట్ చెప్తున్నారు.

★ ఒక్క సర్వే వచ్చింది ఇండియాలో వాళ్ళ లెక్క ప్రకారం జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలి చెప్పారు. జూన్ 3 వరకు ఇండియాలో పీక్స్ వరకు వెళ్తుంది అని చెప్పారు. మన లాంటి దేశాలు లాక్ డౌన్ పాటించాలి అని చెప్పారు అంతే తప్ప గత్యంతరం లేదు. ఎకానమీ పడిపోయితుంది అంటే పడిపోతుంది మరి మన తెలంగాణ 400 కోట్ల పై ఆదాయం లేదు. లాక్ డౌన్ ఇంకా ఉండాలి అని చెప్తున్నారు. నా లెక్క ప్రకారం కొనసాగించాలి.

★ ఒక్కసారిగా జనాలు కుప్పలు కుప్పలుగా వస్తారు. వాళ్ళను ఎవరు కంట్రోల్ చేయాలి. ప్రధాని మోదీతో మాట్లాడుతున్న రోజుకు రెండు సార్లు. ఇంతకు ముందు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి లేదు. ప్రజలకు దండం పెట్టి చెపుతున్న స్టార్టింగ్ స్టేజీలో వస్తే కంట్రోల్ అవుతుంది. ఏక్కవగా వైరస్ వ్యాప్తి చెందితే తొందరగా చనిపోతున్నారు. మోడీ అడిగితే చెప్పాను లాక్ డౌన్ కొనసాగించాలి అని…

★ ఒక్కరు చనిపోతేనే ఇల్లు మొత్తం దిక్కులేకుండా పోతుంది కాబట్టి లక్షల్లో చనిపోతే ఎలా…కష్టంలో కన్నీళ్లు పంచుకునే వారు కావాలి. మేడ్చల్ లో ఒక్క ఆమె ఆమెకు వచ్చిన బియ్యంలో కొన్ని ఇతరులకు ఇచ్చింది. అలాంటి వారికి జూన్ 2 నాడు సన్మానం చేసి అవార్డ్ ఇస్తాం.

★ మోడీ ఎదో పిలుపునిచ్చారు దాన్ని కూడా వెకిలి చేష్టలు చేయొద్దు. జాతి ఐక్యత కోసం ఇచ్చారు. నేను తెలంగాణ ఉద్యమంలో వందల పిలునిచ్చాను. అప్పుడు కూడా నేను గంటలు కట్టాలని చెప్పాను. అప్పుడు కూడా వేదవగాళ్ళు ఏవేవో అన్నారు.

★ తమ ప్రాణాలు తెగించి వారికి కూడా వైరస్ సోకవచ్చు. వైద్య సేవలు అందిస్తున్న వారి అందరికి చేతులు ఎత్తి దండం పెడుతా..

★ వైద్య సిబ్బంది ,ఇతర ల్యాబ్, శానిటేషన్ సిబ్బందికి మనం ధైర్యం చెప్పాలి. వైద్య అన్నింటికి సిద్ధంగా ఉన్నాం, కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కోవిడ్ కు 8 హాస్పిటల్ లు గుర్తించాం. ఎవరికి పాజిటివ్ వచ్చిన గాంధీ హాస్పిటల్ లో ఉండాలి. వైద్యశాఖలో మొత్తం జీతం ఇవ్వాలని చెప్పాను. అంతేకాకుండా వైద్య సిబ్బందికి సీఎం గిఫ్ట్ కింద 10 శాతం ఇవ్వాలని చెప్పాను..

★ పల్లె ప్రగతి ద్వారా సగం దారిద్ర్యం పోయింది. సర్పంచ్ లు చాలా బాగా పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి 7500 అందిస్తాం, మున్సిపల్ గ్రామాల్లో పనిచేసిన వారికి 5000 ఇస్తున్నాము. తల్లిదండ్రుల తరువాత కన్నా పారిశుద్ధ్య కార్మికుల గొప్పవారు. సఫాయి అన్న మీకు సలాం

★కొన్ని పత్రికలు ఇంకా కూడా వక్రబుద్దితో రాస్తున్నాయి. డాక్టర్ లకు సేఫ్టీ కిట్ లు లేవు అని మీకు తెలుసా 40 వేల కిట్స్ ఉన్నాయి. ఇలాంటి వెకిలు రాతలు రాసే వారికి కరోన వ్యాధి రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదు ఇలాంటి వారిని వదిలిపెట్టేదిలేదు. తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తాం. నేను కేసీఆర్ చెప్తున్నా అంటే చాలా ఖతర్నాక్ ఉంటాయి. నేను జర్నలిస్ట్ లకు వ్యతిరేకం కాదు .

★ ఈ సమయంలో జాతి ఐక్యత కోసం పని చేసే వారు గొప్పవారు. కొంతమంది మహిళ సర్పంచ్ లు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. వారు గొప్పవారు. వారికి వందనం. నిజముద్దీన్ వారు ఇంకా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలి.

★ బాగా కష్టపడ్డవారికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తాం. గీ టైమ్ లో దుర్మార్గం చేసేటోళ్లకు కరోనా తగలాలని నేను శాపం పెడుతున్నా… లోకం లోకమే ఆగమైతంటే శవాల మీద పేలాలు ఏరుకుండు ఏంది… ప్రాపర్ టైమ్ లో ప్రాపర్ పనిష్మెంట్ ఇస్తాం కేసీఆర్ చెప్తున్నడు అంటే కొంత ఖతర్నాక్ ఉంటది… ప్రజలను ఏకం చేసి ధైర్యం చెప్పెటోళ్లు గొప్పోల్లు… గిటువంటి చిల్లర మల్లరా గాళ్ళు కాదు.

Also Read : ఇంట్రెస్టింగ్ : OLX లో 182 మీటర్ల  పటేల్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టేశారు!

Comments are Closed

Theme by Anders Norén