ఈ ఏడాది ఏసీబీ లిస్టులో రెవెన్యూశాఖే టాప్…!

ACB, Telangana, anti corruption

ఏడాది చివరి రోజులు కావడంతో 2019 సంవత్సరంలో తెలంగాణలో నమోదైన ఏసీబీ కేసుల జాబితాని విడుదల చేశారు ఆ శాఖ అధికారులు . అవినీతిలో రెవెన్యూ శాఖ మొదటిస్థానంలో నిలిచింది. మొత్తం మీద 173 అవినీతిపరులైన అధికారులను పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.  ఇక రెవెన్యూ శాఖ తర్వాత హోంశాఖ రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానం మున్సిపల్ శాఖ ఉందని పేర్కొన్నారు.

ఈ ఏడాది రెవెన్యూ శాఖలోనే ఎక్కువమంది అవినీతి అధికారులను పట్టుకున్నారు. వీరిలో అత్యధికంగా 54మంది రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న హోంశాఖ, మున్సిపల్ అధికారులు కూడా లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు.

Advertisement

Also Read : మన సదువులు గిట్ల అయితే ఎట్లా?

అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏసీబీకి చిక్కిన అధికారుల జాబితా పెరిగిందని చెబుతున్నారు ఏసీబీ అధికారులు. గతేడాది 139 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 173 కేసులు నమోదు అయ్యాయని చెబుతున్నారు. ఇక రెవెన్యూశాఖలో గతేడాది 37 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం 54 కేసులు నమోదు అయ్యాయి.

రెవెన్యూ శాఖకి సంబంధించి 54 కేసులు, హోంశాఖలో 18 , మున్సిపల్ శాఖ 25 , పంచాయితీ రాజ్ 10 , విద్యుత్ శాఖకి చెందిన ఉద్యోగులపై 12 కేసులు నమోదు చేశారు. హెల్త్ అండ్ మెడికల్ 13, న్యాయ శాఖ 5 , ఇరిగేషన్ 3, విద్యా శాఖ 4, రోడ్డు రవాణా శాఖ 3 కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేసుల వివరాలను విడుదల చేశారు.