చిరంజీవి నీకు అప్పుడు గుర్తులేదా? అల్లు అరవింద్ కి ఎందుకు ఇవ్వాలి?

Allu Aravind, Allu Arjun, Chiranjeevi, Mahesh Babu, Krishna, Awards, Dada Saheb Phalke Award, Padma Shri Award, Sarileru neekevvaru, Ala vaikuntapuramuloo, Two Telugu States

తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో కృషి చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత పురస్కారాలను అందజేస్తాయి. వారు చేసిన కృషికి గాను ఇవి ఎంతో గౌరవంతో ఇవ్వాల్సిన పురస్కారాలు. కానీ ఇప్పుడు ఈ పురస్కారాల కోసం తెర వెనుక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అవార్డు ఇవ్వాలని సభల పైనే డిమాండ్లు మొదలయ్యాయి.

తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. హీరో కృష్ణకి దక్కాల్సిన గౌరవం దక్కలేదని, ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని, దీనికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తండ్రి అల్లు అరవింద్ కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అవార్డులకి వారు అర్హుల కాదా అనే విషయం పక్కన పెడితే ఇలా బహిరంగ సభలో పైనే డిమాండ్ చేయడం అనేది కొంచెం వింతగా ఉంది. అవార్డుల కోసం సాధారణంగా అయితే తెరవెనుక పెద్ద పైరవీలు జరుగుతాయి. అది కాదనలేని వాస్తవం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది అనుకుంటున్నారో ఏమో కానీ బహిరంగంగానే అడిగేస్తున్నారు.

అయితే వీటి పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హీరో కృష్ణ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని చిరంజీవి డిమాండ్ చేయడం మరీ వింతగా ఉందనీ అంటున్నారు. ఆయన కేంద్రమంత్రిగా గా ఉన్నప్పుడు కేంద్రానికి ఒక మాట చెబితే ఆ పని అప్పుడే అయిపోయింది కదా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక అల్లు అరవింద్ ఏం చేశారని పద్మశ్రీ ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.

అవార్డులు అనేవి అభిమానుల నుంచి డిమాండ్లు రావాలి. కానీ ఇలా ఎవరికి వారే సభలో డిమాండ్లు చేస్తే వచ్చేవి కావని చురకలు అంటిస్తున్నారు. ఇలాగే జరిగితే ఎన్టీఆర్ వారసులు కూడా రేపు ఏదో వేదికపైన భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వస్తుందని అంటున్నారు.

Also Read : జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర పక్కన చేసే ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

 

error: write your own !