‘అల వైకుంఠపురములో ‘ సినిమాలో ఇవి గమనించారా?

మాటల మాంత్రికుడుగా త్రివిక్రమ్ స్థాయిని అందరూ చూసేసారు.. తేలికైన పదాలతో అర్ధవంతమైన, అందమైన సంభాషణలు రాయగలడు. ఆయన సినిమాలో డైలాగ్స్ మెయిన్ హీరో.. ఆ తర్వాతే ఎవరైనా .. కేవలం డైలాగ్స్ కోసమే థియేటర్ కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్యే ఎక్కువ.. పురాణాలకి లింకులు పెట్టుకుంటూ ఆయన చెప్పే మాటలకి ఫిదా కానీ అభిమాని ఉండడు.. ఆయన డైలాగ్స్ వెనుక మాత్రమే కాదు ఆయన సృష్టించే పాత్రల వెనుక కూడా చాలా అర్ధం ఉంటుంది. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అల వైకుంఠపురములో ‘ అల్లు అర్జున్ హీరోగా, పూజా హేగ్దే హీరోయిన్ గా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులోని ఆయన సృష్టించిన పాత్రలు చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరము.

మురళీశర్మ – వాల్మీకి

అల్లు అర్జున్ కి తండ్రిగా మురళీశర్మ వాల్మీకి అనే పాత్రలో నటించారు. వాల్మీకి అనే పేరును పెట్టడం వెనుక చాలా అర్ధముంది. రామాయణాన్ని వాల్మీకి మహర్షి మొదలుపెట్టి చివరివరకు నడిపించాడు. ఈ సినిమాని కూడా వాల్మీకి అనే పాత్రను చూపిస్తూనే త్రివిక్రమ్ మొదలుపెట్టాడు.. ఆ పాత్ర మొదలుపెట్టిన కథే ఈ అల వైకుంఠపురములో

సచిన్ కెడ్కర్ – రాధాకృష్ణ

Image result for ala vaikunthapurramuloo movie cast

రాధాకృష్ణులు కలిసి ఉండే ఆవాసం బృందావనం..ఆ బృందావనానికి రూపకర్తలు వారే.. అలాగే ఈ అల వైకుంఠపురములో అనే ఇంటికి రాధాకృష్ణే యజమాని

సుశాంత్ – రాజ్

Image result for Ala Vaikunthapurramuloo murali sharma

తన రాజ్యంలో సైనికులు, బంటులు ఉన్నంతవరకు రాజుపైన చిన్న ఈగ కూడా వాలదు.. ఒక్కసారి వారిని దాటి ఏదైనా తన దగ్గరికి వచ్చినప్పుడే తనబలం ఏంటో తెలుస్తుంది. ఈ సినిమాలో రాజ్ అనే పాత్రను సుశాంత్ పోషించాడు. సినిమా మొదటినుంచి మౌనంగా ఉన్న రాజ్ విషయం తనవరకు వచ్చేసరికి నోరు బయటకి విప్పుతాడు సమస్య నాదని తెలుసుకొని తన ప్రేమించిన అమ్మాయికోసం ఒక్కడిగానే వెళ్తాడు.

అల్లు అర్జున్ – బంటి(బంటు)

Image result for Ala Vaikunthapurramuloo movie cast

రాజుకి నమ్మిన వాడిగా ఉండడమే బంటు లక్షణం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ బంటి (బంటు ) అనే పాత్రలొ కనిపిస్తాడు. ఆ ఇంటికి నేనే వారసుడి అని తెలిసిన కూడా ఇంటికి ఎలాంటి హాని కలగకుండా నమ్మిన బంటు లాగే చూసుకుంటాడు.

టబు – యశోద

Image result for ala vaikunthapurramuloo tabu

ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అసలు తల్లి టబు కానీ ఆసుపత్రిలో బిడ్డలు మారడంతో సుశాంత్ తన కొడుకని అనుకుంటుంది. ఈ పాత్రని చూస్తే మనకి పురాణాల్లో యశోదని గుర్తుకువస్తుంది..

జయరామ్ – రామచంద్ర

Image result for jayaram

రాముడు ఎప్పుడు తన రాజ్యంలో తనతో తానే యుద్ధం చేస్తుంటాడు..ఈ సినిమాలో ఎప్పటినుంచో తన మనసులో ఉన్న నిజాన్ని బయటపెట్టలేక తనలో తానే యుద్ధం చేసుకుంటూ ఉండిపోతాడు..

టైటిల్ – అల వైకుంఠపురములో

Image result for ala vaikunthapurramuloo logo png

రాధాకృష్ణ( సచిన్ కెడ్కర్)- జయ్ రామ్( రామచంద్ర)
ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు.. రాముడు,కృష్ణడు ఇద్దరే ఒక్కటే .. అయానే విష్మవు.. విష్ణువు ఉండే నివాసాన్ని ‘వైకుంఠపురం’ మని అంటారు. అందుకే ఈ సినిమాకు అల వైకుంఠపురములో అనే టైటిల్ ని పెట్టారు..

ఆయన మాటలు వెనకే కాదు ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన పెట్టిన సినిమా పేర్ల వెనుక కూడా ఎంతో అర్థం దాగి ఉంది.

Also Read : సునీల్ త్రివిక్రమ్ సలహా తీసుకున్నావా?

error: write your own !