Off Beat

కలికాలంలో దానకర్ణులు.. పేదల ఆకలి తీర్చడానికి జాగ అమ్మిర్రు!

2 Brothers Sell Land For Rs 25 Lakh To Feed The Poor

2 Brothers Sell Land For Rs 25 Lakh To Feed The Poor

కలికాలం అంటే ఇనుడే తప్ప ఎట్లుంటదో తెల్వదు.. కానీ కరోనా సమయంలో లాక్ డౌన్ రావడంతో అసలు కలికాలం అంటే ఇదేనేమో అని ఒక్కసారి అయిన అనుకోని మనిషి ఉండడు కావచ్చు.. ఇక లాక్ డౌన్ సమయంలో అందరకీ ఇబ్బందులే ఉంటయ్ అది కాదనలేని వాస్తవం.. కానీ పూర్తిగా లెనోడిని ఆదుకోవడానికి ముందుకు రావడమే కదా మానవత్వం అంటే!.. లాక్ డౌన్ సమయంలో ఆకలితో చాలామంది అలమాటిస్తున్న సంగతి తెలిసిందే.. వారిని ఆదుకోవడానికి కొందరు ముందుకు వచ్చి ఉన్నంతలో తమ వంతు భాధ్యతగా విరాళాలు ఇస్తున్నారు.. మరికొంత మంది బియ్యం, పప్పు, ఉప్పు ఇలా నిత్యావసర వస్తువులను మరికొంతమంది పైసలను ఇస్తుర్రు ..ఇది అభినందించాల్సిన విషయమే..

ఇక ఇది ఇలా ఉంటే… కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఇద్దరు అన్నదమ్ములు లాక్ డౌన్ సమయంలో రోజువారీ కూలీ కార్మికులు మరియు వారి కుటుంబాలు అన్నింటికీ బాధపడుతుండడం చూసి చలించిపోయారు.. మానవత్వంతో వారిని అదుకోవాలనే ఆలోచన వచ్చింది. కర్ణాటక కోలార్ జిల్లాలోని తాజమ్ముల్ పాషా మరియు ముజమ్మిల్ పాషా అనే ఇద్దరు అన్నదమ్ములు తమ భూమిని రూ25 లక్షలకు అమ్మిర్రు.. వచ్చిన పైసలతోటి పెద్ద సంఖ్యలో పేద ప్రజలకు అవసరమైన మరియు ఆహార ధాన్యాన్ని సేకరించారు.. ఆ తరవాత తమ ఇంటి పక్కన ఓ గుడారం ఏర్పాటు చేసి, కూలీలకు, నిరాశ్రయులకు వాటిని పంపిణీ చేయడం మొదలుపెట్టారు..

అలా ఇప్పటివరకు ఈ ఇద్దరు సోదరులు కలిసి మూడు వేలకు పైగా కుటుంబాలకు ఆహార ధాన్యం, నూనె, చక్కెర మరియు ఇతర నిత్యావసరాలను సరఫరా చేశారు. అంతేకాకుండా కరోనా నుండి జాగ్రత్త పడడానికి గాను శానిటైజర్లు, మాస్క్ లు కూడా ఇచ్చారు. కరోనా లాంటి కలికాలంలో జాగ అమ్మి మరి పేదోడి ఆకలి తీర్చాలని అనుకోవడం, ఆ ఆలోచనని కార్యరూపం దాల్చడం గ్రేట్ బ్రదర్స్..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

“మా తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. మేము కోలార్‌లోని మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం అక్కడ మతపరమైన పక్షపాతం లేకుండా హిందువులు, సిక్కులు, ముస్లింలు మాకు సహాయపడ్డారు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు.ఇప్పుడు మాకు ఆదుకునే సమయం వచ్చింది” అని అన్నారు.

Also Read : గంభీర్.. హాట్స్ ఆఫ్ ..నీకు సెల్యూట్ చేయాల్సిందే.. ! చేతులెత్తి మొక్కాల్సిందే !

Comments are Closed

Theme by Anders Norén