పాలిటిక్స్ వల్ల చిరంజీవి నేర్చుకున్న నీతి ఏంటి?

Chiranjeevi, Sarileru Neekevvaru, Mahesh Babu, Tollywood, Vijayashanthi, Prajarajyam, Politics, Ethics, Rashmika Mandanna, Cinema

సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, పోటీ చేయడం, ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం, పార్టీని కాంగ్రెస్ లో కలపడం, మళ్లీ సినిమాల్లోకి రావడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి.. పార్టీని ఎందుకు పెట్టాడో చెప్పిన చిరంజీవి ఎందుకు కాంగ్రెస్ లో కలిపాడో మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. అసలు ఈ పాలిటిక్స్ చిరుకి ఎం నేర్పించాయి. వాటివల్ల చిరు ఎం నేర్చుకున్నాడు అన్నదానికి నిన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికైంది.

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు, విజయశాంతి మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చని చూస్తే అర్ధం అవుతుంది. చిరంజీవి, విజయశాంతి కలిసి 20 సినిమాల్లో కలిసి నటించారు. బెస్ట్ పెయిర్ గా వీరికి ముద్రకూడా పడిపోయింది. కానీ రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం చిరుపై విజయశాంతి కామెంట్స్ చేయడం చిరంజీవి తట్టుకోలేకపోయాడు.

Also Read : సునీల్ త్రివిక్రమ్ సలహా తీసుకున్నావా?

ఆ మాటలు మనుసలోనే దాచుకున్నాడు. అడగాల్సిన టైం ఇక్కడ దొరికింది కాబట్టి సభాముఖంగానే ఆడిగేశాడు చిరు..” నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్‌కి వెళ్లావ్ కదా.. అప్పట్లో నన్ను అన్ని మాటలు అన్నావ్.. నీకు ఎలా మనసు వచ్చింది. పోనీ నువ్వు నన్ను అన్ని మాటలు అన్న కూడా నిన్ను నేను ఒక్కమాట అయిన అన్ననా శాంతి “అంటూ చిన్న పిల్లాడిలా ఆడిగేశాడు.. “రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు .. ఎప్పటికి నువ్వే నా హీరో.. నేనే నీ హీరోయిన్” అని విజయశాంతి చెప్పుకొచ్చిన చిరు అక్కడికి ఇక్కడికి వెళ్లి నన్ను ఎందుకు అలా అన్నావ్ అని అదే ప్రశ్నని గుచ్చిగుచ్చి అడిగాడు. అంటే ఆ మాటలు చిరుని ఎంత బాధ పెట్టాయో అర్ధం చేసుకోవచ్చు..

ఇక చివరగా మెగాస్టార్ మాట్లాడుతూ… “రాజకీయం అంటే శత్రుత్వాన్ని పెంచుతోంది… సినిమా పరిశ్రమ స్నేహాన్ని, ప్రేమను పెంచుతోంది” మహేష్ నీ సినిమాతో మళ్లీ నా ఫ్రెండ్ ని కలిశాను చాలా థాంక్స్” అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు చిరు. సో పాలిటిక్స్ లో చిరు పడ్డ బాధలు ఇవి.. రాజకీయంలో ఉండి శత్రుత్వాన్ని పెంచుకోవడం కన్నా, సినిమాల్లో ఉండి ఉన్న బంధుత్వాన్ని కాపాడుకోవడం బెటర్ అనుకొని రాజకీయాలకు చిరు బై బై చెప్పాడన్న విషయం దీనితో స్పష్టం అవుతోంది.

error: write your own !