Trending

లాక్ డౌన్ వలన నష్టపోయింది ఎవరు?

lockdown in india

lockdown in india

ప్రభుత్వం నష్టపోయింది నెల రోజూల లాక్ డౌన్ వలన అనుకుంటున్నారు..నిజానికి ఈరోజే అమ్మకపోతే నష్టపోతాం అనడానికి ప్రభుత్వమేమీ కూరగాయల వ్యాపారం చేయడం లేదు.ప్రభుత్వం తనకొచ్చే ఒక్క పన్నును ఒక్క శాతం కూడా తగ్గించలేదు.అవన్నీ ఈ నెల కాకపోతే వచ్చేనెల అయినా వసూలు చేసేదే అందులో సందేహం లేదు..!

నిజంగా నష్టపోయేది ఎవరంటే..
పక్క ఊర్లు నుండి రాష్ట్రాల నుండి వచ్చిన వలసకూలీలు
జూస్ షాపు వారు
సుతారి మేస్ర్తీలు, కూలీలు
పునాది గుంతలు తీయువారు
సినిమా జూనియర్ ఆర్టిస్ట్స్
కళాకారులు
బాగోతు వారు
గంగిరెడ్ల వారు
సినీమా థియేటర్ లో పనిచేయువారు
ఇళ్ళకు పెయింట్ వేయువారు
సెంట్రింగ్ మేస్త్రీలు
స్లాబ్ పనివారు
కార్పెంటర్లు
ప్లంబర్స్
టైల్స్ పనివారు
చిత్తుకాగితారు ఏరుకునే వారు
బీడీ కార్మికులు
కల్లుగీత కార్మికులు.
వంటవారు
సర్వర్లు
టెంట్ హౌజ్ లు
పూల దుకాణాల వారు
ఇళ్ళల్లో పనిమనుషులు
ఎలక్ట్రిక్ పనివారు
ప్రైవేటు సంస్థల ఉద్యోగులు
పిజ్జా డెలివరీ బాయ్స్
క్యాబ్ డ్రైవర్లు
ఇసుక రవాణా వారు
ఇంటర్నెట్ సెంటర్స్ వారు
ప్రింటింగ్ ప్రెస్ లు
జీరాక్స్ షాపులు
పూజారులు
అన్ని రకాల మెకానిక్ లు
బట్టల షాపుల్లో పనిచేయువారు
పంచర్ షాపువారు
పాన్ షాపు వారు
టీ స్టాల్ ,టీఫీన్ సెంటర్స్ వారు
రెస్టారెంట్స్ లో పనిచేసే ఉద్యోగులు
లేబర్స్ క్లీనర్స్
సెక్యూరిటీ గార్డ్స్
సేల్స్ బాయ్స్
హెయిర్ కటింగ్ సెలూన్స్
బ్యూటీపార్లర్ షాపు వారు
ఆసుపత్రులు
డయాగ్నస్టిక్ సెంటర్ లో పనిచేయువారు
బట్టల షాపు వారు అందులో పనిచేసే కూలీలు
టీవీ DTH లాంటి మెకానిక్ షాపు వారు
ఫ్రిడ్స్ వాషింగ్ మెషిన్స్ లాంటివాటిలో పనిచేసే వర్కర్స్
ఆటో రిక్షా నడిపేవారు
రీక్షా పుల్లర్స్
లారీ క్లీనర్స్
డ్రైవర్స్
బజ్జీల బడ్లు
తోపుడు పండ్లు
గప్ చుప్ కట్లెట్ షాపుల వారు
మొబైల్స్ అమ్మేవారు
మెకానిక్ వారు
ఇళ్ళ వెంట తిరుగుతూ అమ్మే పెడ్లర్స్
దర్జీలు
చెప్పుల షాపు వారు
ఐస్ క్రీం షాప్స్
బట్టలు బ్యాగులు చెప్పులు కుట్టేవారు
X ray Scanning centers
కాంపౌండర్లు నర్సులు
సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్
ఇంక ప్రైవేటు ఉద్యోగులు
అడుక్కునే వారు
పాత ఇనుము చిత్తు కాగితాలు కొనేవారు
కూల్ డ్రింక్ మరియు సోడా బండీవారు
ఇలా దాదాపు వెయ్యి రకాల చిన్న చిన్న వ్యాపారులు మరియు వాటి మీద ఆధారపడిన లక్షల మంది బతుకులు ఈ లాక్ డౌన్ వలన భుగ్గిపాలయ్యాయన్నది నిజం..

కొందరి అత్యుత్సాహం వలన ఈనాడు కాయాకష్టం చేసుకుని బతికే శ్రమజీవులకు ఒకరి ముందు అన్నమో రామచంద్ర అంటూ చేయి చాపవలసిన దుస్థితి ఏర్పడిందంటే దీనికి ఎవరు భాధ్యులు..!

ఈ లాక్ డౌన్ వలన ప్రభుత్వ ఉద్యోగులు సగం హాపీగా ఉన్నారు.వారి ఇబ్బందులు వారికున్నాయి.. పోలీసులు ,డాక్టర్లు,ఎలక్ట్రిసిటీ డాపార్ట్మెంట్ వారు ఆర్థికంగా పూర్తి హాపీగా ఉన్నారు..

ప్రభుత్వం తనకొచ్చే పన్నులు తగ్గాయంటున్నది కాని తగ్గించామనో లేదా రద్దు చేసామనో అనడం లేదు.భూమి కొన్న వారు ఈరోజు కాకపోతే రేపు రిజిస్ట్రేషన్ లు చేయిస్తారు. అప్పుడైనా రుసుం కట్టాల్సిందే..ఇక మీసేవ ద్వారా వెహికల్ ఇన్యూరెన్స్ ల ద్వారా వెహికల్ రిజిస్ట్రేషన్ ల ద్వారా వచ్చే ఆదాయం తర్వాతి నెల అయినా వస్తుంది..ఇక ఇంటిపన్ను, నల్లా పన్ను, భూమి పన్ను ,అప్పులకు వడ్డీలు ఇవన్నీ తర్వాత అయినా వసూలు చేసేదే..!

ఇప్ఫుడు బాగా తగ్గిపోయింది ఏంటయా అంటే మద్యం అమ్మకాలు, పెట్రోల్ ,డీజిల్ అమ్మకాలు మాత్రమే..ఇవి కవర్ చేయడం కష్టం .ఈరోజు వినియోగాన్ని రేపు వినియోగించడం కుదరదు..అలానే సాదారణ పరిస్థితులలో ప్రతిరోజూ కేవలం 50%వెహికిల్స్ మాత్రమే వినియోగంలో ఉంటాయి.అయితే లాక్ డౌన్ ఎత్తివేసాక పరిశ్రమలు తమ దగ్గరున్న స్టాక్ ను తొందరగా తరలించడం కోసం ఇప్పుడున్న 100% లారీలను వినియోగించడం జరుగుతుంది.అలా డీజిల్ వినియోగం ద్వారా వచ్చే పన్ను పెరుగుతుంది.

అలానే గృహ కరెంట్ వినియోగం బాగా పెరిగింది.. పరిశ్రమల వినియోగం తగ్గింది అంటే బయట సంస్థల నుండీ ప్రైవేటు వ్యక్తుల నుండి కొనవలసిన అవసరం ఇప్పుడు లేదు .అంటే ప్రభుత్వం చేసే కరెంట్ ఉత్పత్తి గృహాలకు సరిపోవడమే కాక లాభాలు కూడా బాగానే ఉన్నాయి.

అలానే ఆహార ఉత్పత్తుల వినియోగం సాధారణం కంటే మూడు రెట్లకు పెరిగింది.అంటే మూడు నెలలకు సరిపోను పన్నులు ప్రభుత్వానికి జమకూడుతున్నాయి.
ఇక ఫ్రభుత్వానికి అత్యధికంగా వచ్చే ఆదాయపు పన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఆల్రెడీ ఫిబ్రవరిలోనే వసూలు చేసారు.

ప్రభుత్వం ఒక్క పన్నును చూడా తగ్గించదు.. పెంచదు..పెంచితే జనం రోడ్లమీదకొస్తారు.
అందుకే కంపెనీలకు లాక్ డౌన్ ఉద్దీపనగా వస్తువుల ధరలను పెంచే అవకాశం ఇస్తారు.ధరలు పెంచడం ద్వారా HMGST కూడా అధికంగానే వస్తుంది.సో.. ప్రభుత్వాలకు వచ్చే నష్టం లేదు.నష్టం మొత్తం సాధారణ పౌరులకే…

ధరలు పెంచుతున్నారు అంటే అందులో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి అనుకుంటున్నారేమో.. రెండేండ్ల దాకా జీతాలు మాత్రం పెరగవు. అలానే కంపెనీలకు రకరకాల లోన్లు ,రకరకాల వడ్డీ మాఫీ కార్యక్రమాలు , కరెంట్ యూనిట్ రేట్ తగ్గించడం లాంటివి ఉండనే ఉన్నాయి.అయితే రెండేండ్ల పాటు ఏ వస్తువు రేటు కూడా పెంచవద్దు. ఏ కొత్త ప్రొడక్ట్ ను లాంచ్ చేయవద్దని ప్రభుత్వానికి ప్రజలు అర్టీ పెట్టుకుంటే తప్ప ఈ జన జీవనం గాడిలో పడదు..
కొత్త ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్ కి పేరు మార్చి రేట్ పెంచి అమ్మడం..

EXAMPLE:

రిన్ సబ్బు క్వాలిటీ తగ్గిస్తారు..దాని పాత క్వాలిటీతోనే పేరు మార్చి ధర పెంచి సర్ఫ్ ఎక్సల్ గా నామకరణం చేసినట్లు ఇలాంటివి ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి.

Also Read : గంభీర్.. హాట్స్ ఆఫ్ ..నీకు సెల్యూట్ చేయాల్సిందే.. ! చేతులెత్తి మొక్కాల్సిందే !

Krishna Korivi

Comments are Closed

Theme by Anders Norén