Off Beat

ఈని చేతులకి జట్టలువుట్టా… ! వృద్ధురాలి  పెన్షన్ డబ్బులు ఎత్తుకపోయిండు!

pension money

అసలే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. బయటకు రాలేని పరిస్థితి .. సక్కగా తినడానికి తిండి లేకా జనాలు ఎక్కడ అలమటిస్తారో అని ప్రభుత్వాలు రేషన్ బియ్యం డబల్ ఇస్తోంది. అంతేకాక 1000 రూపాయలను అందజేస్తూ నిత్యావసరాలను కొనుకోవ్వాలని వెల్లడించింది. ఇక ఇలాంటి టైంలో కొందరు వచ్చే పెన్షన్ పైన ఆధారపడ్డారు. ఇలాంటి సమయంలో కొందరు దుర్మార్గులు వారి డబ్బుపైనే కన్నేశారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో స్థానిక రెడ్డీస్‌ హాస్టల్‌లో లక్ష్మమ్మ పోలీసుల కోసం భోజనం వండి ఇంటికి వెళ్తుండగా ప్రభుత్వం అందించిన వృద్ధాప్య పింఛను రూ.2,250ను చీరకొంగులో పెట్టుకుంది. అయితే అనుకోకుండా ఆ డబ్బు కిందపడిపోయింది. దీన్ని ఆమె గుర్తించేలోపే ఓ యువకుడు ఆ నగదును ఎత్తుకొని పరారయ్యాడు.

దీంతో బాధితురాలు లక్ష్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆ వృద్ధురాలికి శోకాన్ని మిగిల్చాడు ఓ యువకుడు.. ఈ విషయాన్ని ఆదోని టూటౌన్ పోలీసుస్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Also Read :  ఏఎస్ఐ కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

Comments are Closed

Theme by Anders Norén