రేపు చిత్తూరు జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ ప్రారంభం

YS Jagan Mohan Reddy,Amma Vodi scheme,chittoor,Government of Andhra Pradesh,వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అమ్మ ఒడి పథకం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

పాలన మొదలు నుంచి చారిత్రాత్మిక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటు తన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని రేపు చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ఈ పథకానికి ప్రభుత్వం 6500 కోట్ల నిధులను కేటాయించింది. నవరత్నాల్లో ఒకటైన ఈ పథకంలో పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్ లోకి సంవత్సరానికి 15 వేల రూపాయలు జమ అవుతాయి. మొదటగా ఈ పథకాన్ని ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు మాత్రమే అమలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థుల కూడా అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు ఈ పథకం కింద దాదాపుగా 43 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.. ప్రతి ఏటా జనవరిలో నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి ఈ డబ్బులు జమవుతాయి…

చిత్తూరులో రేపు జగన్‌ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

► ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు.

► 11.15 గంటలకు చిత్తూరు పీవీకేఎన్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌ సభా ప్రాంగణం వద్దకు సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు.

► 11.15 -11.35 : పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలిస్తారు.

► 11.35 -11.40 : స్ధానిక అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

► 11.45- 1.45 : అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

► తిరిగి 3.45 గంటలకు సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Also Read: పాలిటిక్స్ వల్ల చిరంజీవి నేర్చుకున్న నీతి ఏంటి?

error: write your own !